బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఈ జ్యూస్‍లను ఇంట్లోనే చేసుకోండిలా..
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 02, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే కొన్ని రకాల జ్యూస్‍లు ఇందుకు తోడ్పడతాయి. బరువు తగ్గేందుకు ఉపకరించే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఐదు రకాల జ్యూస్‍లు ఇవే.
Photo: Pexels
తరిగిన ఉసిరి ముక్కలను గ్లాస్ నీళ్లతో మిక్సీలో బ్లెండ్ చేసి ఉసిరి జ్యూస్ తయారు చేసుకోండి. అమ్లా జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గేందుకు ఉపయోపడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
Photo: Pexels
గ్లాస్ నీళ్లలో ఓ సగం నిమ్మకాయ రసాన్ని పిండుకొని, ఓ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. ఈ నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తేనె కొవ్వును కరిగించలదు. ఇలా వెయిట్ లాస్‍కు ఈ జ్యూస్ సహకరిస్తుంది.
Photo: Pexels
తరిగిన క్యారెట్ ముక్కల్లో గ్లాస్ వాటర్ పేసి.. జ్యూస్ చేసుకోండి. క్యారెట్ జ్యూస్‍లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్‍ను ఎక్కువసేపు ఉంచుతుంది. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
ఒక గ్లాస్ నీటితో తరిగిన బీట్‍రూట్ ముక్కలను జ్యూస్‍లా బ్లెండ్ చేసుకొని.. ఉదయం పరగడుపున తాగిండి. ఆకలి తగ్గించడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గేందుకు ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.
Photo: Pexels
కొంత సెలరీని ఓ గ్లాస్ నీళ్లతో జ్యూస్‍లా తయారు చేసుకోండి. ఖాళీ కడుపుతో తాగండి. సెలరీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తరచూ తినాలనే భావనను తగ్గించి వెయిట్ లాస్‍కు ఇది తోడ్పడుతుంది.
Photo: Unsplash
వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దోమ కాటుతో దురద, వాపు కొన్నిసార్లు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దోమ కాటు నుంచి ఉపశమనం కోసం చామంతి పువ్వులను ఉపయోగించవచ్చు.