Crime news : రూ. 500 దొంగిలించాడన్న అనుమానంతో 10ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి చంపిన తండ్రి!-ghaziabad crime news 10 year old killed by father for stealing 500 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : రూ. 500 దొంగిలించాడన్న అనుమానంతో 10ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి చంపిన తండ్రి!

Crime news : రూ. 500 దొంగిలించాడన్న అనుమానంతో 10ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి చంపిన తండ్రి!

Sharath Chitturi HT Telugu
Sep 29, 2024 06:40 AM IST

ఘజియాబాద్​లోని ఓ గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 500 దొంగిలించాడన్న అనుమానంతో, ఓ వ్యక్తి తన 10ఏళ్ల కుమారుడిని కిరాతకంగా కొట్టి చంపేశాడు!

కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి!
కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి! (Photo: Hindustan Times)

ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 10ఏళ్ల బాలుడిని, అతని తండ్రి అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు! రూ. 500 దొంగిలించాడన్న అనుమానంతో కోపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

ఘజియాబాద్​లోని త్యోడి అనేక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల కుమారుడిని బ్లో పైప్​తో కొట్టి చంపిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

శనివారం ఉదయం ఆద్ తండ్రి నౌషాద్, సవతి తల్లి రజియా తమ ఇంట్లో రూ.500 కనిపించకపోవడంతో, కుమారుడే దొంగిలించాడని అనుమానించారు. చివరికి 10ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టాడు తండ్రి.

నౌషాద్​ తన కొడుకును తరచూ కొట్టేవాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఈసారి నౌషాద్ బ్లో పైప్​తో ఆద్​ను కొట్టడం ప్రారంభించాడు. బాలుడి శరీరంపై పలుమార్లు కొట్టాడు. అయితే తలపై కొట్టగా, అది ప్రాణాంతకంగా మారింది.

చివరికి ఘజియాబాద్​లోని త్యోడి గ్రామంలో నివసిస్తున్న ఆద్ గాయాలతో మృతి చెందాడు. బాలుడిని కొట్టడం నౌషాద్​ అలవాటుగా చేసుకున్నాడని పొరుగింటి రహత్ అలీ తెలిపారు. “నౌషాద్ తన కుమారుడిని తరచూ కొట్టేవాడు. ఇంట్లో రూ.500 మాయమవడంతో అతడిని చితకబాదాడు. చివరికి ఆ బాలుడు చనిపోయాడు,” అని చెప్పారు.

ఆద్ తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నౌషాద్, రజియాలను ఘజియాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఘజియాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జ్ఞాన్ ప్రకాశ్ రాయ్ పేర్కొన్నారు.

ప్రేమికులు కలిసి..

ఘజియాబాద్​లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఘజియాబాద్​లో ఓ వ్యక్తిని ఓ మహిళ, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. రాణి (20), రాజు థాపా (22) అనే యువకులు నితీష్ శర్మ(21)ను హత్య చేసినట్లు అంగీకరించారు. శర్మ ఛాతీపై కత్తిపోట్లకు గురయ్యాడు.

పోలీసులు కథనం ప్రకారం రాణిని శర్మ వెంబడించేవాడు. ఒద్దు అని చెప్పినా వినేవాడు కాదు. పలుమార్లు ఆమెను రోడ్డుపై అడ్డుకునేవాడు. చివరికి ఆ వ్యక్తిని చంపేయాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. చంపేశారు! బాధితుడి తండ్రి కిశోర్ శర్మ ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశారు.

థాపాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకే శర్మని అంతమొందించామని నిందితురాలు పోలీసులకు తెలిపింది.

ఈ ఘటన కన్నా ముందు.. మతమార్పిడికి బలవంతం చేసిన నలుగురిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. హథ్రస్​లోని ఓ స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. స్కూల్​ సక్సెస్​ అవ్వాలన్న కారణంగా ఈ విధంగా క్షుద్రపూజలు చేశారు! హథ్రస్​లోని రస్గవన్​లో డీఎల్​ పబ్లిక్​ స్కూల్​లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి చదువుతున్న బాలుడిని బలి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న స్కూల్​ డైరక్టర్​, అతని తండ్రితో పాటు ముగ్గురు టీచర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం