Friday the 13th: 13వ తేదీ శుక్రవారం కలిసి వస్తే అరిష్టమంటారు.. ఎందుకో తెలుసా..?
13వ తేదీన శుక్రవారం వస్తే అరిష్టమన్న నమ్మకం చాలా దేశాల్లో ఉంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ రోజును అత్యంత నష్టదాయక రోజుగా, దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఏ ముఖ్యమైన పనులు పెట్టుకోరు. ఇప్పుడు ఎక్స్ వంటి ప్లాట్ ఫామ్స్ లో, మీమ్స్ లో ‘Friday the 13th’ ట్రెండింగ్ అవుతోంది.
సాధారణంగా శుక్రవారం నుంచే వీకెండ్ కు సిద్ధమవుతారు. కానీ, ఈ శుక్రవారం అంటే మాత్రం చాల మంది భయపడుతున్నారు. అందుకు కారణం, ఈ శుక్రవారం 13వ తేదీన రావడమే. చాలా దేశాల్లో 13వ తేదీ, శుక్రవారం కలిసి రావడాన్ని అరిష్టంగా భావిస్తారు. ఈ రోజు ముఖ్యమైన పనులేవీ పెట్టుకోరు. శుక్రవారం, 13 వ తేదీ అంటే భయపడే ఫ్రిగ్గాట్రిస్కైడెకాఫోబియా (friggatriskaidekaphobia) ఉన్నవారు కూడా ఉన్నారు. శుక్రవారం, 13వ తేదీ కలిసి వస్తే భయపడడానికి అనేక కారణాలున్నాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ‘Friday the 13th’
ఈ రోజు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వంటి ప్లాట్ ఫామ్స్ లో ‘Friday the 13th’ ట్రెండింగ్ గా ఉంది. ఈ "ఫ్రైడే ది 13వ తేదీ" హ్యాష్ ట్యాగ్ తో యూజర్లు అనేక పోస్ట్ లు, మీమ్స్ పెడుతున్నారు. ఆన్లైన్ చాటింగ్ లో ఈ తేదీ అపఖ్యాతి గురించి చర్చించుకుంటున్నారు. అలాగే, దీనిపై వివిధ మీమ్స్, జోక్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ ట్రెండ్స్ లో ‘Friday the 13th’ పదం టాప్ లో ట్రెండ్ అవుతోంది.
క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం..
13వ తేదీ శుక్రవారం చుట్టూ ఉన్న మూఢనమ్మకాల మూలాలు ఉన్నాయి. నిజానికి, ఈ రోజును దురదృష్టకరమైనదిగా పరిగణించడానికి ఖచ్చితమైన కారణం లేదు. అయితే, శుక్రవారానికి, దురదృష్టానికి మధ్య ఉన్న సంబంధాన్ని క్రైస్తవ సంప్రదాయాల నుంచి గుర్తించవచ్చు. యేసుక్రీస్తును శిలువ వేసింది శుక్రవారం నాడు అని, ద్రోహి అయిన యూదాస్ ఇస్కరియోతు లాస్ట్ సప్పర్ కు వచ్చిన 13వ అతిథి అని నమ్ముతారు. అంతేకాక, మధ్య యుగాలలో శుక్రవారాన్ని "హ్యాంగ్ మెన్స్ డే"గా పిలుస్తారు. ఈ రోజు సామూహిక ఉరిశిక్షలు విధించేవారట. దాంతో, క్రమేణా, శుక్రవారం దురదృష్టకరమైన రోజు అనే భావన సామాజిక విశ్వాసాలలో పాతుకుపోయింది.
గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో
ప్రస్తుతం గూగుల్ (google) ట్రెండ్స్ లో 10 వేలకు పైగా సెర్చ్ వాల్యూమ్ తో 'ఫ్రైడే ది 13' టాప్ ట్రెండ్ గా నిలిచింది. ఈ ట్రెండ్ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాల ప్రాముఖ్యతను, వింతైన విశేషాల పట్ల ఆసక్తిని, పురాణాల పట్ల ప్రజల ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. ఈ 'ఫ్రైడే ది 13' పై సోషల్ మీడియా (social media) లో వచ్చిన మీమ్స్ ను, పోస్ట్ లను ఇక్కడ చూడండి..