crime news: ‘‘చెడు స్నేహాలతో, చదువును నిర్లక్ష్యం చేస్తున్నందుకు కన్న కొడుకునే చంపేశాడు..’’
crime news: స్కూల్ కు వెళ్లకుండా, చెడు స్నేహాలతో, బలాదూరుగా తిరుగుతూ, చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని కన్న కొడుకునే ఒక తండ్రి హత్య చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ తండ్రిపైభారతీయ న్యాయ సంహిత (BNS) కింద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
crime news: బెంగళూరులో పాఠశాలకు వెళ్లకుండా, చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తన 14 ఏళ్ల కుమారుడు తేజస్ ను అతడి తండ్రి హత్య చేశాడు. కన్న కొడుకునే హత్య చేసిన ఆ తండ్రిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
స్కూల్ కు వెళ్లడం లేదని..
తన కుమారుడు తేజస్ పాఠశాలకు వెళ్లకపోవడం, తన చదువును నిర్లక్ష్యం చేయడంతో పాటు చెడు స్నేహాలు చేస్తూ, వారితో కలిసి తిరుగుతుండడంపై ఆ తండ్రి కలత చెందాడు. చివరకు అతడికి చెడు అలవాట్లు కూడా కావడంతో తట్టుకోలేకపోయాడు. పలుమార్లు హెచ్చరించినా తేజస్ పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, ఆగ్రహంతో క్షణికావేశంతో అతడు తన కుమారుడిని చంపేశాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు, అరెస్ట్
ఆ తండ్రిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేఎస్ లేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని బెంగళూరు (bengaluru news) పోలీసులు తెలిపారు.
ఆస్తి డబ్బుల కోసం
బెంగళూరులోనే జరిగిన మరో ఘటనలో 44 ఏళ్ల మహిళను ఆమె ఆస్తి డబ్బుల కోసం ఆమె కుమారుడు హత్య చేశాడు. తమిళనాడుకు చెందిన జయమ్మ ఇటీవల ఓ ఆస్తిని విక్రయించగా, కొంత డబ్బు చేతికి వచ్చింది. ఆ డబ్బులో తనకు కూడా వాటా ఇవ్వాలని జయమ్మ చిన్న కుమారుడు, ఆటో డ్రైవర్ అయిన ఉమేష్ కోరాడు. కానీ, అందుకు జయమ్మ అంగీకరించలేదు. పలుమార్లు వారి మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరిగాయి. చివరకు, ఆగ్రహంతో ఉమేశ్ కన్న తల్లినే కడతేర్చాడు. హత్య జరిగిన రోజు రాత్రి 8 గంటల సమయంలో ఉమేష్ తన తల్లి ఇంటికి వెళ్లగా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో ఉమేష్ ఆమె ముఖంపై గుద్ది, ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనలో మేనల్లుడు సురేష్ ఉమేష్ కు సహకరించినట్లు సమాచారం. మరో ఘటనలో కార్తీక్ భట్ (32) అనే వ్యక్తి తన భార్యను, చిన్నారిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం సమయంలో కాలాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ముందు పడి భట్ మృతి చెందాడు.