Mother burnt alive : తల్లిని చెట్టుకు కట్టి, సజీవదహనం చేసిన కుమారులు! కుటుంబ తగాదాలే కారణం?-elderly mother tied to tree burned alive by sons in tripura over dispute ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mother Burnt Alive : తల్లిని చెట్టుకు కట్టి, సజీవదహనం చేసిన కుమారులు! కుటుంబ తగాదాలే కారణం?

Mother burnt alive : తల్లిని చెట్టుకు కట్టి, సజీవదహనం చేసిన కుమారులు! కుటుంబ తగాదాలే కారణం?

Sharath Chitturi HT Telugu

Tripura crime new : పశ్చిమ త్రిపురలో ఓ 62ఏళ్ల వృద్ధురాలిని కుమారులు, కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేసి, సజీవదహనం చేసినట్టు సమాచారం. కుటుంబ కలహాలు ఇందుకు కారణం అని తెలుస్తోంది.

నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు..

త్రిపురలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ తగాదాల కారణంగా ఓ 62 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి, సజీవంగా నిప్పంటించి చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది.. ఆ మహిళ సొంత కుమారులు, కుటుంబసభ్యులు! ఈ వార్త త్రిపురలో కలకలం సృష్టించింది.

ఇదీ జరిగింది..

పశ్తిమ త్రిపుర చంపక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్ బరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు నిప్పంటించారని సమాచారం అందుకున్న పోలీసు బృందం అక్కడికి వెళ్లి చూడగా.. కాలిపోయిన మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. ఈ వివరాలను జిరానియా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కమల్ కృష్ణ కోలోయ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. వృద్ధురాలి భర్త ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఇద్దరు కుమారులపై ఆధారపడింది. ఆమె తన ఇద్దరు కుమారులలో ఒకరితో నివసిస్తుండగా, మరొక కుమారుడు రాష్ట్ర రాజధాని అగర్తలాలో నివసిస్తున్నాడు.

తల్లి హత్య కేసులో ఆమె ఇద్దరు కుమారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి ఇవ్వనున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం కావచ్చు అని ఓ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తల్లికి నిప్పంటించి, చంపేశారన్న వార్త కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో చండీగఢ్​లోని సెక్టార్ 35లోని పబ్లిక్ పార్కులో 26 ఏళ్ల మహిళను నిప్పంటించిన ఘటన వెలుగుచూసింది. సంబంధంపై తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన ప్రియుడు యువతికి నిప్పంటించాడు.

తాను నిర్దోషినని, బ్రేకప్​కి ముందు చివరిసారిగా కలుసుకున్న తర్వాత ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆమెను కాపాడేందుకు పరిగెత్తిన వ్యక్తి తన టీషర్టుతో మంటలను ఆర్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. హథ్రస్​లోని ఓ స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. స్కూల్​ సక్సెస్​ అవ్వాలన్న కారణంగా ఈ విధంగా క్షుద్రపూజలు చేశారు!

హథ్రస్​లోని రస్గవన్​లో డీఎల్​ పబ్లిక్​ స్కూల్​లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి చదువుతున్న బాలుడిని బలి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న స్కూల్​ డైరక్టర్​, అతని తండ్రితో పాటు ముగ్గురు టీచర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.