Trump’s Pakistani daughter: ‘‘నేను డొనాల్డ్ ట్రంప్ కూతురుని..’’- పాకిస్తానీ బాలిక వీడియో వైరల్
Trump’s Pakistani daughter: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి వైట్ హౌజ్ లో అడుగుపెట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన తండ్రి అని నమ్మకంగా చెబుతున్న ఒక పాకిస్తానీ బాలిక. ఇది పాత వీడియోనే అయినా.. ట్రంప్ విజయం నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారి, 5.5 లక్షల వ్యూస్ సాధించింది.
Trump’s Pakistani daughter: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (us presidential elections 2024) డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయన కుమార్తెగా చెప్పుకుంటున్న పాకిస్థాన్ అమ్మాయి పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను Siasat.pk 2018 డిసెంబర్ లో పోస్ట్ చేశారు. అయితే, అప్పట్లో ఇది పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. 2024 అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయం తర్వాత, అనేక ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలు దానిని తిరిగి పోస్ట్ చేశాయి.
రీ పోస్ట్ లు..
ఎక్స్ లో పాపులర్ అకౌంట్ అయిన ఘర్ కే కలేష్ నుంచి రీపోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు 5.5 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో లో ఆ బాలిక తాను డొనాల్డ్ ట్రంప్ కుమార్తెనని నమ్మకంగా చెబుతోంది. ఈ వీడియోలో ఆ బాలిక తనను తాను ముస్లిం, పంజాబీ అని ఉర్దూలో పరిచయం చేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన తండ్రి అని ఆమె నమ్మకంగా చెబుతోంది. ట్రంప్ తన తల్లిని బాధ్యతారాహిత్యంగా భావించారని, తన కుమార్తెను సరిగా చూసుకోలేరని భావించారని ఆమె ఆ వీడియోలో చెప్పింది.
నెటిజన్ల నుంచి స్పందనలు
ఈ వైరల్ వీడియోకు ఆన్లైన్లో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఆమె చెప్పిన విషయాన్ని నమ్మలేదు. దాంతో, ఈ వీడియోపై పలువురు సోషల్ మీడియా (social media) యూజర్లు ఫన్నీ కామెంట్లు చేశారు. "ఆమె తన ఉచ్ఛారణను జమునాపర్ నుండి దక్షిణ ఢిల్లీకి సున్నితంగా మార్చింది" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఆ అమ్మాయి ఉర్దూ, ఇంగ్లీష్ ల్లోకి భాషను మార్చడం క్రేజీగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో నెటిజన్ ఇవాంకా ట్రంప్ ను గుర్తు చేశారు.
కపిల్ శర్మ షో
‘‘ఇది పాకిస్తాన్ కపిల్ శర్మ షో’’ అని మరో యూజర్ సరదాగా కామెంట్ చేశాడు. 'వైసే తో పురా పాకిస్తాన్ కా బాప్ యూఎస్ఏ హై' అని మరొకరు కామెంట్ చేశారు. ‘షోహ్రత్ మిల్టే హి రిష్తేదారీ యాద్ ఆనే లగ్తీ హై సబ్కో (మీరు విజయం సాధించిన తర్వాత మీరు కొత్త బంధువులను పొందడం ప్రారంభిస్తారు)' అని మరొకరు చమత్కరించారు.
డోనాల్డ్ ట్రంప్ గెలుపు
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (us presidential elections 2024) డోనాల్డ్ ట్రంప్ (donald trump) గెలుపు పలువురిని షాక్ కు గురి చేసింది. కమలా హారిస్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా కన్నీళ్లు పెట్టుకోవడం వంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రంప్ విజయోత్సవ ప్రసంగం సందర్భంగా ఓ బాలిక తన టీవీ సెట్ ను పగలగొట్టిన వీడియో ఒకటి ఉంది. అయితే, ఈ పాకిస్థానీ (pakistan) అమ్మాయి వీడియో మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది.