Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​- ఆండ్రాయిడ్​ 15 వచ్చేసింది..-nothing phone 2 users to get android 15 this week features how to download ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​- ఆండ్రాయిడ్​ 15 వచ్చేసింది..

Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​- ఆండ్రాయిడ్​ 15 వచ్చేసింది..

Sharath Chitturi HT Telugu
Nov 07, 2024 11:39 AM IST

Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​! ఆండ్రాయిడ్​ 15 వచ్చేసింది. నథింగ్​ ఓఎస్​ 3.0 ని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? కొత్తగా వచ్చే ఫీచర్స్​ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​
నథింగ్​ ఫోన్​ 2 యూజర్స్​కి అలర్ట్​ (Nothing)

నథింగ్​ ఫోన్​ (2) వినియోగుదారులకు గుడ్​ న్యూస్​! నథింగ్ ఓఎస్ 3.0 ఓపెన్ బీటాగా వచ్చేసింది. ఇది ఆండ్రాయిడ్​ 15 ఆధారిత సాఫ్ట్​వేర్​. ఇది ఇప్పటికే గూగుల్ పిక్సెల్ పరికరాలకు అందుబాటులోకి వచ్చింది. కొత్త ఫీచర్లు, పర్ఫార్మెన్స్​తో కూడిన ఈ అప్డేట్ ఇప్పటికే నథింగ్ ఫోన్ (2ఏ)లో విడుదలైపోయింది.

నథింగ్ ఓఎస్ 3.0 ఫర్ నథింగ్ ఫోన్ (2):

నథింగ్​ ఓఎస్​ 3.0లోని షేర్డ్ విడ్జెట్స్ ఫీచర్​ ప్రత్యేకంగా నిలవనుంది. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులతో విడ్జెట్లను లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ హోమ్ స్క్రీన్​పై ఇతరుల విడ్జెట్​లను వీక్షించడానికి, ప్రతిచర్యల ద్వారా వారితో సంభాషించడానికి అనుమతిస్తుంది. దీనిని కంపెనీ "కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త మార్గం" అని చెబుతోంది. కొత్త క్లాక్ ఫేస్​లతో మరింత కస్టమైజబుల్ లాక్ స్క్రీన్, మరిన్ని విడ్జెట్​లకు సరిపోయేలా విస్తరించిన విడ్జెట్ స్పేస్​ను కూడా ఈ అప్డేట్ పరిచయం చేస్తుంది.

నథింగ్​ ఫోన్​ (2) రీడిజైన్ చేసిన విడ్జెట్ లైబ్రరీ, అప్డేటెడ్ విజువల్స్, నెట్ వర్క్, ఇంటర్నెట్, బ్లూటూత్ సెట్టింగ్స్​ని మెరుగుపరచడం ద్వారా క్విక్ సెట్టింగ్​లను ఈ తాజా సాఫ్ట్​వేర్​తో పునరుద్ధరించింది సంస్థ. కెమెరా ఎక్స్​పీరియెన్స్​ని కూడా మెరుగపరిచింది. ఇది ఇప్పుడు కెమెరా విడ్జెట్ నుంచి వేగవంతమైన కెమెరా లాంచ్​ని అందిస్తుంది. తక్కువ హెచ్డిఆర్ సీన్ ప్రాసెసింగ్ సమయాన్ని అందిస్తుంది. పోర్ట్రెయిట్ మోడ్ ప్రభావాలు ఇప్పుడు ముఖ పరిమాణంపై ఆధారపడి ఉన్నాయి. లో లైట్​ పర్ఫార్మెన్స్​ కూడా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.

కొత్త ఫింగర్ ప్రింట్, ఛార్జింగ్ యానిమేషన్లు, AI-ఆధారిత యాప్ ఆప్షన్​, ప్రాధాన్యత- క్విక్​ యాక్సెస్​ కోసం స్క్రీన్ ఎడ్జ్​లో పాప్-అప్​లను పిన్ చేసే ఫీచర్ ఇతర ముఖ్యమైనవి.

నథింగ్ ఫోన్ (2)లో నథింగ్ ఓఎస్ 3.0 బీటాను ఎలా డౌన్​లోడ్ చేయడం?

  1. మొదట, మీరు నథింగ్ OS వెర్షన్ 2.6ను ఇన్​స్టాల్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. బిల్డ్ నెంబరు పాంగ్-U2.6-241016-1700 ఉండాలి.
  2. ఏపీకేని డౌన్​లోడ్ చేసుకోండి. మీ డౌన్​లోడ్​ల నుంచి ఇన్​స్టాల్ చేయండి.
  3. సెట్టింగ్స్ > సిస్టమ్ కు వెళ్లి > బీటా వెర్షన్​కు అప్డేట్ చేయండి.
  4. "కొత్త వెర్షన్ కోసం చెక్​ చేయండి" అనే ఆప్షన్​ మీద ట్యాప్ చేయండి. అక్కడ సూచించే స్టెప్స్​ని ఫాలో అవ్వండి.

ఇతర ఫోన్లకు నథింగ్ ఓఎస్ 3.0 ఓపెన్ బీటా ఎప్పుడు వస్తుంది?

నథింగ్ ఫోన్ 2 బీటా అప్డేట్​ను ఈ రోజు, నవంబర్ 6 న అందుకుంటుంది. నథింగ్ ఫోన్ (1), నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్, సిఎంఎఫ్ ఫోన్ 1 అన్నీ డిసెంబర్ 2024 లో అప్డేట్ పొందుతాయని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం