Nothing Phone 2a Plus : వచ్చేసిన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ.. ఇదిగో ఫీచర్లు
Nothing Phone 2a Plus Launched : నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఇండియాలో లాంచ్ అయింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్.
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ నుండి వచ్చిన ఈ తాజా స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీగా వచ్చాయి. 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. అదే సమయంలో మీరు దాని టాప్-ఎండ్ వేరియంట్ కోసం రూ .31,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని సేల్ ఆగస్టు 7న ఫ్లిప్ కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, 50 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో ఎన్నో గొప్ప ఫీచర్లు కనిపిస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 1080×2412 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్ నెస్ లెవల్ 1300 నిట్స్, డిస్ ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 5ను కూడా ఫోన్‌లో అందిస్తోంది. ఈ ఫోన్‌లో 12జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్ సెట్ ఉంది.
50 ఎంపీ ఫ్రంట్ కెమెరా
గ్లైఫ్ రియర్ ఇంటర్ఫేస్ ఉన్న ఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీల కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జెఎన్ 1 సెన్సార్‌ను అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా ఓఐఎస్, ఈఐఎస్ సపోర్ట్‌తో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇది 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్ బ్యాటరీ 56 నిమిషాల్లో 0 నుండి 100శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనుంది.