4B movement : ‘శృంగారం లేదు- పిల్లల్ని కనము’- ట్రంప్​ గెలుపుతో అమెరికన్​ మహిళల నిరసనలు!-no sex no babies what is the 4b movement sweeping internet after trumps win ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  4b Movement : ‘శృంగారం లేదు- పిల్లల్ని కనము’- ట్రంప్​ గెలుపుతో అమెరికన్​ మహిళల నిరసనలు!

4B movement : ‘శృంగారం లేదు- పిల్లల్ని కనము’- ట్రంప్​ గెలుపుతో అమెరికన్​ మహిళల నిరసనలు!

Sharath Chitturi HT Telugu
Nov 08, 2024 01:10 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ గెలుపుతో.. చాలా మంది యుఎస్ మహిళలు దక్షిణ కొరియా మహిళల 4బీ ఉద్యమాన్ని చేపడుతున్నారు. శృంగారానికి దూరంగా ఉంటామని, పిల్లల్ని కనమని తేల్చిచెబుతున్నారు.

అమెరికాలో ఊపందుకున్న 4బీ ఉద్యమం..
అమెరికాలో ఊపందుకున్న 4బీ ఉద్యమం..

2024 అమెరికా ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్​ ట్రంప్​ సంతోషంగా ఉన్నా, ఆ ఫలితాలు చాలా మంది మహిళలకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి! డొనాల్డ్​ ట్రంప్​ తిరిగి అధికారంలోకి రావడం అబార్షన్​ హక్కులకు వినాశకరమైనదని సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. తమ హక్కులను లాగేసుకున్నారని, ఫలితంగా పరుషులతో డేటింగ్​ చేయడానికి ఆందోళనగా ఉందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘4బీ’ ఉద్యమం అమెరికా వ్యాప్తంగా ఊపందుకుంది! ఈ ఉద్యమంలో తాము కూడా చేరుతున్నట్టు చాలా మంది మహిళలు సోషల్​ మీడియాలో చెబుతున్నారు. అసలు ఏంటి ఈ 4బీ ఉద్యమం? అమెరికన్​ మహిళలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు?

4బి ఉద్యమం అంటే ఏమిటి?

పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు గత కొన్నేళ్లుగా, దక్షిణ కొరియా మహిళలు ఒక కొత్త విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. ఇకపై వ్యవస్థలో క్రియాశీల భాగస్వాములు కాబోమని తేల్చిచెప్పారు. రివెంజ్ పోర్న్, లింగ ఆధారిత హింస, ఫెమిసైడ్ వంటి సమస్యలకు ప్రతిస్పందనగా కొంతమంది దక్షిణ కొరియా మహిళలు రిలేషన్స్​కి దూరంగా ఉంటున్నారు. తమపై హింస ఆగకపోతే 4బీ ఉద్యమం వల్ల జననాల రేటు తగ్గుతుందని, ఫలితంగా జనాభా నెమ్మదిగా చచ్చిపోతుందని ఈ మహిళలు హెచ్చరిస్తున్నారు.

వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం.. ఈ 4బీ ఉద్యమం వెనుక భావజాలం నాలుగు సాధారణ నియమాలపై ఆధారపడి ఉంది.

బియోనే: పురుషులతో డేటింగ్ లేదు

బిసెక్సు: పురుషులతో శృంగారం లేదు

బిహోన్: వివాహం లేదు

బిచుల్సన్ : పిల్లల పెంపకం లేదు

మహిళలపై అధిక హింసకు ప్రతిస్పందనగా 4బీ ఉద్యమం ప్రారంభమైంది. 2016లో సియోల్​లోని పబ్లిక్ బాత్రూమ్​లో ఓ యువతి హత్యకు గురైంది. మహిళలు పురుషులతో వ్యక్తిగత శృంగార సంబంధాలను నిలిపివేస్తామని ఎక్కువగా టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లో ప్రతిజ్ఞ చేశారు.

అమెరికాలోని మహిళలు ఏమంటున్నారు?

మహిళల శరీరాలపై నిరంతం రాజకీయాలు జరుగుతున్నాయని, యూఎస్​లో గణనీయమైన మార్పును సృష్టించడానికి సాహసోపేతమైన 4బీ ఉద్యమం ఖచ్చితంగా అవసరం పడుతుందని మహిళలు భావిస్తున్నారు. దేశంలో లింగ అసమానతలపై పురుషులను పూర్తిగా బహిష్కరించాలని పలువురు మహిళలు ఇతరులను కోరుతున్నారు.

ఒకరిద్దరు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి చాలా మంది మహిళలు మద్దతుపలుకుతున్నారు. అయితే ఇలాంటి ఉద్యమం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ‘మన సమాజ నిర్మాణంలో స్త్రీవివక్ష అనేది లోతుగా ముడిపడి ఉందని ట్రంప్ ఎన్నిక రుజువు చేసింది,’ అని అంటున్నారు.

విస్తృతంగా షేర్ చేసిన మరో ట్వీట్​లో ఎక్స్ యూజర్ @solitasims ఇలా రాశారు,

“లేడీస్, విషయం చెప్పినప్పుడు నేను చాలా భయపడుతున్నాను (వాస్తవానికి), మీ గర్భాశయాలను మగవారి కోసం క్లోజ్​ చేసే సమయం ఆసన్నమైంది. వారు మనల్ని ద్వేషిస్తారని ఈ ఎన్నికలు.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా రుజువు చేస్తున్నాయి. వారికి రివార్డులు ఇవ్వకండి,” అని పేర్కొన్నారు.

“4బీ ఉద్యమం అంటే ఏమిటని ఇప్పటికీ ఆలోచిస్తున్న వారికి డేటింగ్ లేదు, శృంగారం లేదు, పిల్లలు లేరు, పెళ్లి లేదు,” అని ఒకరు ట్వీట్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం