పోర్న్ అతిగా చూస్తే ఏమవుతుంది? శృంగారంపై ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే?
ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి రావడంతో ఇటీవలకాలంలో పోర్న్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే పోర్న్ అతిగా చూస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
సెక్స్ ఎడ్యుకేషన్ మంచిదే. అయితే.. ఈ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పోర్న్ వీడియోలను ఆశ్రయిస్తుంటారు. పోర్న్ చూడటానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ.. అతిగా పోర్న్ చూడటం మీ లైంగిక జీవితానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు.
పోర్న్ ఎందుకు చూస్తారు?
పోర్న్ చూడటం ద్వారా తమ కలలను అన్వేషిస్తూ, కొత్త ఊహల్లోకి వెళ్లినట్లు కొందరు భావిస్తారు. నిజ జీవితంలో జరగని విషయాల గురించి ఊహించుకోవడానికి పోర్న్ ఒక సాధనంగా భావిస్తుంటారు అని సెక్సాలజిస్ట్ నియాతి షా అభిప్రాయపడ్డారు.
పోర్న్ వీడియోలను కొందరు ఒత్తిడిని తగ్గించే మార్గంగా చూస్తుంటారు. “మనం లైంగికంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇది సహజమైన ఒత్తిడి, ఉపశమనానికి బటన్‌లా పని చేస్తాయి. ఇది రిలాక్స్‌గా అనిపిస్తుంది” అని షా వివరించారు.
పోర్న్ చూడటం వల్ల ఇబ్బందా?
లైంగిక సంబంధాలపై పోర్నోగ్రఫీ ప్రాథమికంగా హాని కలిగించనప్పటికీ, పోర్న్ అధికంగా చూస్తే మాత్రం అది సన్నిహిత సంబంధాలకు సవాళ్లుగా మారుతుంది. అతిగా పోర్న్ చూడటం వలన మీ శృంగార జీవితంలో దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదాలు ఉన్నాయి.
పోర్న్ వీడియోల్లో సాధారణంగా స్క్రిప్ట్‌తో కూడిన దృశ్యాలు ఉంటాయి. అవి నిజ జీవిత లైంగిక అంచనాలకి సరిపోలకపోవచ్చు. అలానే భాగస్వామి వైపు నుండి కొంత అసౌకర్యం ఉండవచ్చు. అలానే వ్యక్తులు తమ సొంత లైంగిక సామర్థ్యాలను పోల్చుకుని మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఒత్తిడి మీ ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. అలానే లైంగిక ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. లైంగిక సంతృప్తి కోసం పోర్న్‌పై అధికంగా ఆధారపడడం వల్ల భాగస్వామితో నిజ జీవితంలో సాన్నిహిత్యం, భావోద్వేగ బంధంపై దృష్టి తగ్గుతుంది. నిజ జీవితంలో లైంగిక అనుభవాలపై ఆసక్తి తగ్గడానికి ఇది దారితీయవచ్చు.
పోర్న్‌ను ఆస్వాదించడం ఎలా?
పోర్న్ అస్సలు చూడకూడదని చెప్పడం లేదు. కానీ మీరు కొన్ని విషయాలను మీ మనస్సులో ఉంచుకుని పోర్న్‌ను ఆస్వాదించొచ్చు. లైంగిక ప్రేరణ కోసం పోర్న్‌ని చూడటం చాలా సులభం. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. మీరు ఆ పోర్న్ వీడియోలకి బానిసగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి పోర్న్ చూడటంలో ఎప్పుడూ పరిమితులు దాటొద్దు. శృంగారం గురించి మీ భాగస్వామి భయపడుతున్నా లేదా ఆందోళనలో ఉన్నా సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కలిసి పోర్న్ చూడొచ్చు. భాగస్వామికి అవగాహన కల్పించడానికి కొంత మంది పోర్న్ చూస్తుంటారు. కారణాలు ఏవైనా.. పోర్న్ చూడటంలో పరిమితులు మాత్రం దాటకూడదు.