Diwali 2024: దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు-diwali 2024 october 31 or november 1 know exact date puja timings significan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Diwali 2024: దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు

Diwali 2024: దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు

Sudarshan V HT Telugu
Oct 26, 2024 07:36 PM IST

Diwali 2024: ఈ సంవత్సరం దీపావళి ఏ రోజు వస్తుందన్న సందిగ్ధత చాలా మందిలో నెలకొని ఉంది. కొందరు దీపావళి అక్టోబర్ 31వ తేదీన వస్తుందని, మరికొందరు నవంబర్ 1వ తేదీన వస్తుందని చెబుతున్నారు. ఇందులో ఏది సరైంది? అలాగే, లక్ష్మీపూజ ముహూర్త సమయాలేంటి? ఇక్కడ తెలుసుకోండి.

దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు
దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు (HT_PRINT)

Diwali 2024: దీపావళి పర్వదినాన్ని జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ చాలా మంది షాపింగ్ చేస్తూ, తమ ఇళ్లను రంగోలీలు, ఫెర్రీ లైట్లతో అలంకరించడంలో బిజీగా ఉన్నారు. అయితే, అందరిలో ఒక గందరగోళం నెలకొని ఉంది. అది దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం. దీపావళి అక్టోబర్ 31న వస్తుందా? లేక నవంబర్ 1 వ తేదీననా? అనే ప్రశ్నకు ఇక్కడ జవాబు చూడండి. దీపావళి, ఖచ్చితమైన తేదీ, పూజ సమయాలను ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 31ననే..

ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం చంద్రుడు కనిపించనుండటంతో దీపావళి పండుగను అదే రోజు అంటే అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. అయితే కొన్ని నగరాల్లో మాత్రం నవంబర్ 1న దీపావళి వేడుకలు జరగనున్నాయి. పంచాంగం ప్రకారం, అమావాస్య తిథి నవంబర్ 1, 2024 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది, అయితే చంద్రుడు కనిపించిన సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ పూజ సాంప్రదాయకంగా నిర్వహిస్తారు కాబట్టి, అక్టోబర్ 31, 2024 దీపావళి జరుపుకోవడానికి అనువైన రోజని జాగరణ్ జోష్ నివేదించింది.

అక్టోబర్ 30న ఛోటీ దీపావళి

అక్టోబర్ 30న ఛోటీ దీపావళి లేదా నరక చతుర్దశి జరుపుకుంటారు. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 31న లక్ష్మీపూజతో దీపావళి (deepavali) పండుగ జరుపుకోనుంది. నవంబర్ 1న గోవర్ధన పూజ నిర్వహిస్తారు. దీపావళి తర్వాత గోవర్ధన్ పూజ, భాయీ దూజ్ ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 29న (మంగళవారం) ధంతేరాస్ జరుపుకోనున్నారు.

దీపావళి పూజా సమయాలు:

  • దీపావళి 2024: అక్టోబర్ 31
  • లక్ష్మీ పూజ ముహూర్తం - సాయంత్రం 06:52 గంటల నుండి 08:41 pm
  • వ్యవధి - 01 గంటల 50 నిమిషాలు
  • ప్రదోష కాలం -సాయంత్రం 06:10 గంటల నుండి 08:52 pm
  • అమావాస్య ప్రారంభం: అక్టోబర్ 31 ఉదయ 6.22 గంటలు.
  • అమావాస్య ముగింపు: నవంబర్ 1, ఉదయం 8.46 గంటలు

నగరాల వారీగా లక్ష్మీ పూజ ముహూర్తం

ద్రిక్ పంచాంగం ప్రకారం, లక్ష్మీ పూజ కోసం నగరాల వారీగా పూజ సమయాలు ఇక్కడ ఉన్నాయి.

న్యూఢిల్లీ: సాయంత్రం 5:36 నుంచి 6:16 వరకు

గురుగ్రామ్: సాయంత్రం 5:37 నుంచి 6:16 వరకు

నోయిడా: సాయంత్రం 5:35 నుంచి 6:16 గంటల వరకు

ముంబై: సాయంత్రం 6:57 నుంచి 8:36 వరకు

చండీగఢ్: సాయంత్రం 5:35 నుంచి 6:16 గంటల వరకు

పుణె: సాయంత్రం 6:54 నుంచి 8:33 గంటల వరకు

చెన్నై: సాయంత్రం 5:45 నుంచి 6:16 వరకు

బెంగళూరు: సాయంత్రం 6:47 నుంచి 8:21 వరకు

అహ్మదాబాద్: సాయంత్రం 6:52 నుంచి 8:35 వరకు

దీపావళి చరిత్ర

చెడుపై మంచి సాధించిన విజయానికి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినందుకు ప్రతీ సంవత్సరం దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం, కొత్త బట్టలు ధరించడం, ప్రియమైనవారికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, రుచికరమైన స్వీట్లు తినడం మరియు రంగోలి చేయడం ద్వారా జరుపుకుంటారు. లక్ష్మీదేవిని, వినాయకుడిని కూడా పూజిస్తారు.

Whats_app_banner