Delhi-Mumbai Expressway : ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వే.. ఓపెనింగ్​ రేపే!-delhimumbai expressway route opening date see 10 things to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi-mumbai Expressway : ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వే.. ఓపెనింగ్​ రేపే!

Delhi-Mumbai Expressway : ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వే.. ఓపెనింగ్​ రేపే!

Sharath Chitturi HT Telugu
Feb 11, 2023 08:37 AM IST

Delhi-Mumbai Expressway opening date : ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వేలోని ఒక భాగాన్ని ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఢిల్లీ ముంబై ఎక్స్​ప్రెస్​ వే
ఢిల్లీ ముంబై ఎక్స్​ప్రెస్​ వే

Delhi-Mumbai Expressway route : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఢిల్లీ-ముంబై ఎక్స్​ప్రెస్​వే ప్రాజెక్ట్​లో కీలక్​ అప్డేట్​! ఈ ఎక్స్​ప్రెస్​వేలోని ఒక భాగాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 12) ప్రారంభిచనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ఎక్స్​ప్రెస్​వే పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణం 12 గంటలు తగ్గుతుంది! ఈ ఎక్స్​ప్రెస్​వేతో కనెక్టివిటీ సైతం భారీగా వృద్ధిచెందనుంది. ఈ నేపథ్యంలో ఈ ఢిల్లీ-ముంబై ఎక్స్​ప్రెస్​వేకు సంబంధించిన కొన్ని హైలైట్స్​ను తెలుసుకుందాము..

8 లేన్​లు.. 180 కిమీలు..

Delhi-Mumbai Expressway opening date : ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వే అనేది 8 లేన్​ గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ వే. భవిష్యత్తులో దీనిని 12లేన్​లుగా విస్తరించొచ్చు.

ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్​, గుజరాత్​, మహారాష్ట్రల్లో మొత్తం మీద 15వేల హెక్టార్​ల భూమిని తీసుకుని ఈ ఎక్స్​ప్రెస్​వేను రూపొందించారు.

Delhi-Mumbai Expressway map : ఎక్స్​ప్రెస్​వేపై ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు గాను.. 94 ప్రాంతాల్లో రెస్టారెంట్లతో పాటు వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

కోటా, ఇండోర్​, జైపూర్​, భోపాల్​, వడోదారా, సూరత్​తో కలిపి 40కిపైగా ఇంటర్​ఛేంజ్​లు ఉంటాయి ఈ ఎక్స్​ప్రెస్​వేపై.

Delhi-Mumbai Expressway news : ఢిల్లీ-ముంబై ఎక్స్​ప్రెస్​వేలోని సోహ్నా- డౌస ప్రాంతాన్ని ఆదివారం ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ- జైపూర్​ ప్రయాణం రెండు గంటలకు తగ్గిపోతుంది.

2018లో ఈ ప్రాజెక్ట్​ బడ్జెట్​ను తొలుత రూ. 98,000 కోట్లుగా అంచనా వేశారు. 12లక్షల టన్నుల స్టీల్​ను వినియోగించారు. ఇది 50 హౌరా బ్రిడ్జ్​లతో సమానం. భారీ ఉపాధి అవకాశాలు కూడా దక్కాయి.

Delhi-Mumbai Expressway update : రోడ్డు మీద ఢిల్లీ నుంచి ముంబైకి ఇప్పుడు 1,424కి.మీల దూరం ఉంది. ఈ ఎక్స్​ప్రెస్​వే వస్తే.. అది 180కి.మీలు తగ్గి 1,242కి.మీలకు చేరుతుంది.

ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వేపై ఆటోమేటెడ్​ ట్రాఫిక్​ మేనేజ్​మెంట్​ సిస్టెమ్​ ఉండనుంది.

Delhi Mumbai expressway : జంతువులు సురక్షితంగా రోడ్లను దాటేందుకు ఓవర్​పాస్​లు, అండర్​పాస్​లను కూడా నిర్మించారు. ఇలా చేయడం ఇండియాతో పాటు ఆసియాలోనే తొలిసారి! ఈ ఎక్స్​ప్రెస్​వే కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్