Bengaluru-Chennai Expressway : 2024 మార్చ్​ నాటికి బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే సిద్ధం!-bengaluruchennai expressway will be ready by march 2024 says nitin gadkari ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bengaluru-chennai Expressway Will Be Ready By March 2024 Says Nitin Gadkari

Bengaluru-Chennai Expressway : 2024 మార్చ్​ నాటికి బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే సిద్ధం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 06, 2023 08:55 AM IST

Bengaluru-Chennai Expressway : 2024 మార్చ్​ నాటికి బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు.

వచ్చే ఏడాదిలో అందుబాటులోకి బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే!
వచ్చే ఏడాదిలో అందుబాటులోకి బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే! (Savitha B)

Bengaluru-Chennai Expressway : రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే గురించి కీలక అప్డేట్​ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. 2024 మార్చ్​ నాటికి.. ఈ ఎక్స్​ప్రెస్​వే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

బెంగళూరులో గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు నితిన్​ గడ్కరీ. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్​లో భాగంగానే.. 52కి.మీల బెంగళూరు- మైసూర్​ గ్రీన్​ఫీల్డ్​ హైవేను కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు.

Bengaluru-Chennai Expressway inauguration : "వచ్చే నెలలో బెంగళూరు- మైసూర్​ హైవే ప్రాజెక్ట్​ పూర్తవుతుంది. కొన్ని పనులు పెండింగ్​లో ఉండటం చూశాను. అవి సమయానికి అయిపోతాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని లేదా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిస్తాము," అని నితిన్​ గడ్కరీ అన్నారు.

నితిన్​ గడ్కరీ ప్రకారం.. బెంగళూరు- మైసూర్​లో 10లెన్ల ప్రాజెక్ట్​ నిర్మాణం జరుగుతోంది. హైవేలను ఆనుకుని ఉన్న గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లేందుకు.. చెరో వైపు రెండు లేన్లను ఏర్పాటు చేశారు. మిగిలినవి డైరక్ట్​గా బెంగళూరు/మైసూర్​కు వెళ్లేందుకు ఉపయోగపడతాయి.

Bengaluru-Chennai Expressway Nitin Gadkari : బెంగళూరు- మైసూర్​ ప్రాజెక్ట్​ను రెండు భాగాలుగా విడదీశారు. ఒకటి.. బెంగళూరు నుంచి నిదఘట్ట వరకు. ఇంకోటి.. నిదఘట్ట నుంచి మైసూర్​ వరకు ఉంటుంది. ప్రాజెక్ట్​ పూర్తయితే.. బెంగళూరు నుంచి మైసూర్​కు.. కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్రం చెబుతోంది.

"మేము జాతీయ రహదారులను నిర్మించి ఇస్తున్నాము. ఇక ఆ పరిసర ప్రాంతాలను ఇండస్ట్రియల్​ క్లస్టర్​గా అభివృద్ధి చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే," అని నితిన్​ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

Bengaluru-Chennai Expressway route map : మొత్తం మీద.. 285.3కి.మీల బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వేను నిర్మిస్తోంది కేంద్రం. 231కి.మీల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. 2024 మార్చ్​ నాటికి ఎక్స్​ప్రెస్​వే పనులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్ట్​లో కొంత అటవీ ప్రాంతం కూడా ఉందని, అందులో నిర్మాణాల కోసం క్లియరెన్స్​ ఇవ్వాలని కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మైకి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు నితిన్​ గడ్కరీ.

అంతేకాకుండా.. బెంగళూరు శాటిలైట్​ రింగ్​ రోడ్డు నిర్మాణంపై కసరత్తులు చేస్తున్నట్టు నితిన్​ గడ్కరీ వివరించారు. దీని వ్యయం రూ. 17వేల కోట్లని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం మీద ఇదొక 288కి.మీల ప్రాజెక్ట్​ అని వెల్లడించారు. ఈ 288 కి.మీల్లో కర్ణాటకలోనే 243కి.మీల రోడ్డు ఉంటుందని స్పష్టం చేశారు.

Bengaluru-Chennai Expressway project : "ఈ శాటిలైట్​ రింగ్​ రోడ్డును.. పుణె- బెంగళూరుకు కనెక్ట్​ చేయాలని చూస్తున్నాము. ఆ తర్వాత.. దానిని ముంబై- పుణె ఎక్స్​ప్రెస్​వేకు కనెక్ట్​ చేస్తాము. ఈ పనులు పూర్తయితే.. బెంగళూరు నుంచి ముంబైకి కేవలం ఆరున్నర- ఏడు గంటల్లో వెళ్లిపోవచ్చు," అని నితిన్​ గడ్కరీ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం