Delhi excise case: లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు ఈడీ రిమాండ్-delhi excise policy case court sends manish sisodia to ed remand till 17 march latest updates
Telugu News  /  National International  /  Delhi Excise Policy Case: Court Sends Manish Sisodia To Ed Remand Till 17 March. Latest Updates
మనీశ్ సిసోడియా
మనీశ్ సిసోడియా (ANI)

Delhi excise case: లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు ఈడీ రిమాండ్

10 March 2023, 19:50 ISTHT Telugu Desk
10 March 2023, 19:50 IST

Delhi excise case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కోర్టు తాజాగా వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది.

Delhi excise case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో (Delhi excise case) ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏడు రోజుల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అనుమతించింది. మార్చి 17 వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉంటారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసును (Delhi excise case) ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. సిసోడియాను (Manish Sisodia) ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది.

Delhi excise case: ఈడీ విచారణ

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను గురువారం ఈడీ తీహార్ జైళ్లో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చింది. సిసోడియాను 10 రోజుల కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరింది. స్వల్ప వాదనల అనంతరం 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. లిక్కర్ పాలసీ (Delhi excise case) రూపకల్పనలో సిసోడియా (Manish Sisodia) ది కీలక పాత్ర అని ఈడీ ఆరోపించింది. ఈ స్కామ్ కోసం కొన్ని సిమ్ కార్డులను, మొబైల్ ఫోన్లను సిసోడియా వేరే వారి పేరుపై ముందే కొనిపెట్టారని వివరించింది. ఈ స్కామ్ (Delhi excise case) కు సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర నిందితుల పాత్రను తెలుసుకోవడం కోసం సిసోడియా (Manish Sisodia) కస్టడీ అవసరమని వాదించింది. దాంతో, రౌజ్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ఈడీ అభ్యర్థనను అంగీకరించి, 7 రోజుల పాటు సిసోడియాను కస్టడీలోకి తీసుకోవడానికి అంగీకరించారు.