Delhi CM Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు-delhi court grants bail to delhi chief minister arvind kejriwal in delhi liquor scam case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Cm Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

Delhi CM Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 20, 2024 09:15 PM IST

Bail to Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది

లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్
లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ (AFP)

Bail to Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దొరికింది. ఈ కేసులో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది.

బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఆదేశాలను జారీ చేశారు. 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 

అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది సంబంధిత కోర్టు ఎదుట రేపు బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు వీలుగా తాత్కాలిక ఉపశమనం లభించగా … ప్రచారం నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు. 

"మాకు కోర్టుపై నమ్మకం ఉంది... కేజ్రీవాల్ జీకి బెయిల్ వచ్చింది.. నిజం గెలుస్తుంది" అని పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నాయకుడు భగవంత్ మాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ… ఇప్పటి వరకు ED సమర్పించిన ఆధారాలన్నీ కూడా అబద్ధాలతో కూడిన విధంగా ఉన్నాయని ఆరోపించారు.  కేజ్రీవాల్ జైలును నుంచి విడుదల కావటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.

“ఇలాంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రావడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయబోతోంది. ఢిల్లీ ప్రజలకు ఇది శుభవార్త.. ఇప్పటి వరకు ఈడీ చేసిన ప్రకటనలు అబద్ధాలపై ఆధారపడి ఉన్నాయి.. ఇది కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టేందుకు వేసిన నిరాధారమైన తప్పుడు కేసు," అని సంజయ్ సింగ్ ANI కి చెప్పాడు.

విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి ఈడీ పలు అంశాలను తీసుకెళ్లింది.   2021 ఏడాదిలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ నుంచి అందిన నిధుల వివరాలను కోర్టుకు సమర్పించింది. చన్ ప్రీత్ సింగ్ చెల్లించిన డబ్బులతో కేజ్రీవాల్ గ్రాండ్ హయత్ హోటల్ లో బస చేశారని తెలిపింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకోని న్యాయనస్థానం… కేజ్రీవాల్ కు బెయిల్ ను మంజూరు చేసింది.

 

Whats_app_banner