Daam virus : ఈ వైరస్ మీ ఫోన్‌ను హ్యాక్ చేయగలదు.. తస్మాత్ జాగ్రత్త!
Daam virus : కొత్తగా వచ్చిన ఓ వైరస్.. మీ ఫోన్‌ను, కాంటాక్ట్స్‌ను, కాల్ రికార్డింగ్స్‌ని, కెమెరాను హ్యాక్ చేయగలదు! ఆండ్రాయిడ్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని సీఈఆర్టీ-ఇన్ చెబుతోంది.
Daam virus : ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో 'డామ్' వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది మీ ఫోన్లోకి ప్రవేశిస్తే.. అతి సున్నితమైన వివరాలన్నీ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్టీ-ఇన్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) సూచనలు జారీ చేసింది. ఎలాంటి యాంటీ వైరస్ ప్రొగ్రామ్నైనా ఇది దాటుకుంటూ వెళ్లగలదని స్పష్టం చేసింది.
డామ్ వైరస్ ప్రభావం ఎంత..?
సీఈఆర్టీ- ఇన్ ప్రకారం.. డామ్ వైరస్‌తో మీ కాల్ రికార్డ్స్, కాంటాక్ట్స్, హిస్టరీ, కెమెరాలను హ్యాక్ చేయవచ్చు. ఈ డేటాను థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ లేదా యాప్స్‌కు పంపిణీ చేసే ఫీచర్ ఇందులో ఉంది. ఫేక్ వెబ్సైట్లు, అన్‌ట్రస్టెడ్ లింక్స్‌పై క్లిక్ చేయకపోవడం శ్రేయస్కరం.
Daam virus Android : డామ్ వైరస్ అనేది ఒక ఆండ్రాయిడ్ మాల్వేర్. ఏఈఎస్ ఎన్స్క్రిప్షన్ అల్గారిథమ్‌తో పని చేసి ఈ వైరస్.. డివైజ్‌లను కంట్రోల్ చేసి డేటాను దోచుకోవచ్చు. ఇందుకోసం యాప్‌లో ప్రత్యేక కోడ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇది డివైజ్‌లోకి ప్రవేశిస్తే, లోకల్ స్టోరేజ్లని ఇతర ఫైల్స్‌ను డిలీట్ చేయగలదు. '.enc' ఫైల్స్ మాత్రమే ఉంటాయి. 'readme_now.txt' అని రాన్సమ్ నోట్ ఉంటుంది.
ఇది ఫొన్లోకి ప్రవేశిస్తే, సెక్యూరిటీ చెక్‌ను సులభంగా దాటుకుని వెళ్లిపోగలదు. అనంతరం సున్నితమైన డేటాను దోచుకోగలదు.
డామ్ వైరస్ నుంచి ఎలా తప్పిచుకోవాలి?
డామ్ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని టిప్స్ చెబుతోంది సీఈఆర్టీ-ఇన్.
- అన్‌ట్రస్టెడ్ లింక్స్‌పై క్లిక్ చేయకండి
- Daam virus precautions : యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి.
- అనుమానాస్పద ఫోన్ నెంబర్లు కనిపిస్తే జాగ్రత్తపడండి.
- యూఆర్ఎల్స్ తక్కువగా ఉన్న లింక్స్‌తో జాగ్రతగా ఉండండి.
సంబంధిత కథనం