Vivo V29 Lite : వివో వీ29 లైట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​.. లాంచ్​ కూడా త్వరలోనే​!-vivo v29 lite specifications leaked check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V29 Lite : వివో వీ29 లైట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​.. లాంచ్​ కూడా త్వరలోనే​!

Vivo V29 Lite : వివో వీ29 లైట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​.. లాంచ్​ కూడా త్వరలోనే​!

Sharath Chitturi HT Telugu
May 21, 2023 09:18 AM IST

Vivo V29 Lite : వివో వీ29 లైట్​ త్వరలోనే లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

వివో వీ29 లైట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​..
వివో వీ29 లైట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​.. (Representative image)

Vivo V29 Lite : వివో వీ29 లైట్​ స్మార్ట్​ఫోన్​పై కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్​.. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో త్వరలోనే లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ను సంస్థ అధికారికంగా రివీల్​ చేయాల్సి ఉంది. అయితే.. ఈ వివో వీ29 లైట్​కు సంబంధించిన స్పెసిఫికేషన్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ29 లైట్​- స్పెసిఫికేషన్స్​ ఇవే!

Vivo V29 Lite 5G launch : ప్రముఖ టిప్​స్టర్​ సుధాన్షు అంభోరే ప్రకారం.. వివో వీ29 లైట్​లో 1080x2400 పిక్సెల్స్​తో కూడిన ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉండనుంది. 20:9 స్క్రీన్​ రేషియో, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉండొచ్చు. ఇందులో స్నాప్​డ్రాగన్​ 695 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ లభించొచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది 44వాట్​ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ గ్యాడ్జెట్​లో 64ఎంపీ ప్రైమరీ, డ్యూయెల్​ 2ఎంపీ సెన్సార్​లు ఉండొచ్చు. సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:- Vivo X90 Pro vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఏది బెస్ట్​?

Vivo V29 Lite 5G features : ఈ స్మార్ట్​ఫోన్​ డైమెన్షన్స్​ కూడా లీక్​ అయ్యాయి. దీని డైమెన్షన్స్​ 7.89x74.79x164.24ఎంఎం. బరువు 177గ్రాములు. డ్యూయెల్​ సిమ్​ కనెక్షన్​ స్లాట్​, బ్లూటూత్​ 5.1, వైఫై, యూఎస్​బీ టైప్​-సీ ఛార్జింగ్​ పోర్ట్​ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్​తో ఈ వివో వీ29 లైట్​ రానుంది!

ఈ వివో వీ29 లైట్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్​ టైమ్​లో తెలుస్తాయి.

వివో వీ29ఈ..

Vivo V29 Lite 5G price in India : మరో స్మార్ట్​ఫోన్​ వివో వీ29ఈ కూడా మార్కెట్​లోకి అడుగుపెట్టనుందని రూమర్స్​ వస్తున్నాయి. ఇందులో డైమెన్సిటీ 7000 ఎస్​ఓసీ చిప్​సెట్​, 4,600ఎంఏహెచ్​ బ్యాటరీ వంటివి ఉండొచ్చు. ఈ డివైజ్​పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం