Vivo X90, Vivo X90 Pro: వివో ఫ్లాగ్‍షిప్ ఫోన్లు వచ్చేశాయి: ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రూ.8వేల వరకు ఆఫర్
Vivo X90, Vivo X90 Pro: వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో మొబైళ్లు భారత మార్కెట్‍లో అడుగుపెట్టాయి. ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో వచ్చాయి. ప్రీ-బుకింగ్‍కు అందుబాటులో ఉన్నాయి.
Vivo X90, Vivo X90 Pro: వివో ఎక్స్90 సిరీస్ (Vivo X90 Series) ఇండియాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫోన్లు భారత మార్కెట్‍లోకి బుధవారం అడుగుపెట్టాయి. ఇప్పటికే చైనా సహా గ్లోబల్‍గా విడుదలైన ఈ మొబైళ్లు.. ఇప్పుడు ఇండియాకు వచ్చాయి. దాదాపు రెండు మొబైళ్లు ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. అయితే, వివో ఎక్స్90 ప్రో కెమెరాల విషయంలో మరింత ప్రీమియమ్ లెన్స్‌తో వచ్చింది. ఇప్పటికే ఈ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ మొదలుకాగా.. రూ.8,000 వరకు తగ్గింపు పొందేలా ఆఫర్ ఉంది. వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో పూర్తి వివరాలు ఇవే.
వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో స్పెసిఫికేషన్లు
Vivo X90, Vivo X90 Pro: వెనుక కెమెరాల సెటప్, బ్యాటరీ, చార్జింగ్ ఫీచర్లు మినహా మిగిలిన అన్ని విషయాల్లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో మొబైళ్లు ఒకే రకమైన స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి.
డిస్‍ప్లే: 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను ఈ రెండు ఫోన్లు కలిగి ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫోన్లు వచ్చాయి. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్13తో అడుగుపెట్టాయి.
Vivo X90 వెనుక కెమెరాలు: ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX866 OIS ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు జెయిస్ (ZEISS) బ్రాండెడ్ కెమెరాలతో వచ్చాయి.
Vivo X90 Pro వెనుక కెమెరాలు: వివో ఎక్స్90 ప్రో వెనుక 1 ఇంచుల సైజ్ ఉండే Sony IMX989 లెన్స్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పోట్రయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు వెనుక ఉంటాయి.
ఫ్రంట్ కెమెరా: వివో ఎక్స్ 90, వివో ఎక్స్90 ప్రో మొబైళ్లు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో వచ్చాయి.
బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: వివో ఎక్స్90 మొబైల్‍లో 4,810mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ల (W) వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. వివో ఎక్స్90 ప్రో 4,870mAh బ్యాటరీతో వచ్చింది. 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్‍కు ప్రో మోడల్ సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ వైఫై6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లను Vivo X90, Vivo X90 Pro కలిగి ఉన్నాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో వచ్చాయి.
వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ధర, సేల్
Vivo X90, Vivo X90 Pro: వివో ఎక్స్90 ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.
Vivo X90 - 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.59,999
Vivo X90 - 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.63,999
వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది.
Vivo X90 Pro - 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.84,999
వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో మొబైళ్లు ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, వివో వెబ్‍సైట్‍లో ప్రీ-బుకింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్90 మొబైల్ అస్ట్రాయిడ్ బ్లాక్, బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో వచ్చింది. ఎక్స్ ప్రో ఫోన్ లెజండరీ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. మే 5వ తేదీన ఈ రెండు ఫోన్లు ఓపెన్ సేల్‍కు వస్తాయి.
Vivo X90, Vivo X90 Pro: ఆఫర్లు
వివో ఎక్స్90 ప్రో మొబైల్‍ను ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రీ-బుక్ చేసుకుంటే రూ.8,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. వివో ఎక్స్90 ఫోన్‍ను హెచ్‍డీఎఫ్‍సీ, ఐసీఐసీఐ కార్డుతో ప్రీ-బుక్ చేసుకుంటే రూ.5,500 డిస్కౌంట్ లభిస్తుంది.