CISCE results 2023 : సీఐఎస్​సీఈ క్లాస్​ 10, 12 ఫలితాలు విడుదల..-cisce class 10 12 results declared see full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cisce Class 10, 12 Results Declared See Full Details Here

CISCE results 2023 : సీఐఎస్​సీఈ క్లాస్​ 10, 12 ఫలితాలు విడుదల..

Sharath Chitturi HT Telugu
May 14, 2023 04:03 PM IST

CISCE results 2023 : సీఐఎస్​సీఈ క్లాస్​ 10, 12 ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

సీఐఎస్​సీఈ క్లాస్​ 10, 12 ఫలితాలు విడుదల..
సీఐఎస్​సీఈ క్లాస్​ 10, 12 ఫలితాలు విడుదల.. (ANI)

CISCE results 2023 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ 12 ఫలితాలను ఆదివారం ప్రకటించింది సీఐఎస్​సీఈ (కౌన్సిల్​ ఫర్​ ది ఇండియన్​ స్కూల్​ సర్టిఫికేట్​ ఎగ్జామినేషన్స్​). అధికారిక నోటిఫికేషన్​ ప్రకారం.. అభ్యర్థులు తన ఫలితాలను http://cisce.org లేదా http://results.cisce.org వెబ్​సైట్స్​లో చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాది ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు.. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్​ 29 వరకు జరిగాయి. మరోవైపు ఐఎస్​సీ క్లాస్​ 12 పరీక్షలు.. ఫిబ్రవరి 13 నుంచి మార్చ్​ 31 వరకు జరిగాయి.

ISC class 12 results 2023 : ఈ ఏడాది జరిగిన ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షల్లో మొత్తం మీద 98.94శాతం మంది పాసయ్యారు. హాజరైన అబ్బాయిల్లో 98.71శాతం మంది, అమ్మాయిల్లో 99.21శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2023లో 53.92శాతం అబ్బాయిలు, 46.08శాతం మంది అమ్మాయిలి పరీక్షకు హాజరయ్యారు. 2022లో పాస్​ పర్సెంటేజ్​ 99.97శాతంగాను, 2021లో 99.98శాతంగాను ఉంది.

ఇక ఐఎస్​సీ క్లాస్​ 12 పరీక్షల్లో 96.93శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద అబ్బాయిల పాస్​ పర్సెంటేజ్​ 95.96గాను, అమ్మాయిల పాస్​ పర్సెంటేజ్​ 98.01గాను ఉంది.

ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- www.cisce.org లోకి వెళ్లండి.

ICSE class 10 results : స్టెప్​ 2:- రిజల్ట్స్​ పేజ్​లోకి వెళ్లండి. ఐసీఎస్​ఈ బోర్డు ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ 2023 లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- కోర్స్​ కోడ్​ను ఐసీఎస్​ఈ/ ఐఎస్​సీగా సెలెక్ట్​ చేసి, ఐడెంటిఫికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ వంటి లాగిన్​ డిటైల్స్​ ఇవ్వండి.

స్టెప్​ 4:- స్క్రీన్​పై మీ రిజల్ట్స్​ కనిపిస్తాయి.

స్టెప్​ 5:- ఆ పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకుని, ప్రింటౌట్​ తీసుకోండి.

సీబీఎస్​ఈ పరీక్షల ఫలితాలు..

CBSE class 12 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. క్లాస్​ 12లో మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్​ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే.. ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది. 

ఇక సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 93.12% ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 21,658,05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 20, 167,79 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం