Cargo ship hijacked : 15 మంది భారతీయులతో కూడిన నౌక​ హైజాక్​- రంగంలోకి ఇండియన్​ నేవీ!-cargo ship with 15 indians onboard hijacked off somalia ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cargo Ship Hijacked : 15 మంది భారతీయులతో కూడిన నౌక​ హైజాక్​- రంగంలోకి ఇండియన్​ నేవీ!

Cargo ship hijacked : 15 మంది భారతీయులతో కూడిన నౌక​ హైజాక్​- రంగంలోకి ఇండియన్​ నేవీ!

Sharath Chitturi HT Telugu
Jan 05, 2024 01:08 PM IST

Cargo ship hijacked : సోమాలియా తీరానికి సమీపంలో ఎంవీ లీలా నార్ఫోక్ నౌక హైజాక్​కు గురైంది. ఇందులో 15మంది భారతీయులు ఉన్నారు.

15 మంది భారతీయులతో కూడిన నౌక​ హైజాక్​- రంగంలోకి ఇండియన్​ నేవీ!
15 మంది భారతీయులతో కూడిన నౌక​ హైజాక్​- రంగంలోకి ఇండియన్​ నేవీ! (lilaglobal / representational image)

MV LILA NORFOLK hijacked : సోమాలియా తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌక.. గురువారం సాయంత్రం హైజాక్​కు గురైంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం.హైజాక్​ అయిన నౌకలోని వారిని రక్షించేందుకు భారత నౌకాదళం ప్రయత్నిస్తోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

అసలేం జరిగింది..?

హైజాక్​కు గురైన నౌక కదలికలపై నిఘా ఉంచేందుకు భారత నౌకాదళం.. విమానాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. నౌకతో కమ్యూనికేషన్​ని విజయంవంతంగా ఏర్పాటు చేసినట్టు, నౌకలోని సిబ్బంది పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించరు.

యూకేఎంటీవో (యునైటెడ్ కింగ్​డమ్​ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్) పోర్టల్​లో.. 2024 జనవరి 4 సాయంత్రాన సుమారు 5, 6 మంది గుర్తుతెలియని సాయుధ సిబ్బంది నౌకను హైజాక్​ చేసినట్టు సమాచారం అందినట్టు భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.

MV LILA NORFOLK crew : హైజాక్​కు గురైన నౌకను రక్షించేందుకు ఇండియన్​ నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్​ఎస్​ చెన్నై యుద్ధ నౌకను సంబంధిత ప్రాంతానికి పంపించింది. ఇంకొన్ని గంటల్లో ఐఎన్​ఎస్​ చెన్నైకి హజాక్​కు గురైన నౌకకు మధ్య లింక్​ ఏర్పడుతుందని సమాచారం.

నావికాదళ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. నౌక కదలికలను పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలోని ఇతర ఏజెన్సీలు/ ఎంఎన్ఎఫ్ సమన్వయంతో మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు.

ఈ హాజాక్​కు ఎవరు పాల్పడ్డారు? ఎంత మంది నౌకలో ఉన్నారు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న వివరాలు తెలియరాలేదు.

పెరుగుతున్న సముద్రపు దొంగల దాడి..

Cargo ship hijacked : అరేబియా సముద్రంలో మాల్టీస్ జెండా కలిగిన వాణిజ్య నౌకను గుర్తుతెలియని దుండగులు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే హైజాకింగ్ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. నాడు.. హైజాక్​కు గురైన నౌకలోని 18మందిలో ఒకరిని ఇండియన్​ నేవీ రక్షించింది. ఆ బల్గేరియన్​ వాసికి మెడికల్​ కేర్​ని అందించింది. అనంతరం అతడిని ఐఎన్​ఎస్​ కొచ్చిలో తరలించింది.

2008 - 2013 మధ్య ఆ ప్రాంతంలో పైరేట్​ల దాడులు గరిష్ట స్థాయిలో ఉండేవి. కానీ భారత నావికాదళంతో సహా మల్టీ నేషనల్​ మేరిటైమ్​ టాస్క్​​ ఫోర్స్​ బృందం సమిష్టి కృషి కారణంగా ఆ తరువాత దాడులు తగ్గిపోయాయి. కానీ చూస్తుంటే, దాడులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది!

Whats_app_banner

సంబంధిత కథనం