K Armstrong death : బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడిని ఎందుకు చంపారు? అసలు ఎవరు ఈ కే ఆర్మ్​స్ట్రాంగ్​?-bsp tamil nadu chief hacked to death mayawati reacts who was k armstrong ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  K Armstrong Death : బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడిని ఎందుకు చంపారు? అసలు ఎవరు ఈ కే ఆర్మ్​స్ట్రాంగ్​?

K Armstrong death : బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడిని ఎందుకు చంపారు? అసలు ఎవరు ఈ కే ఆర్మ్​స్ట్రాంగ్​?

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 08:10 AM IST

బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడి దారుణ హత్యతో చెన్నై ఉలిక్కిపడింది. అసలు ఎవరు ఈ కే. ఆర్మ్​స్ట్రాంగ్​? ఆయన్ని ఎవరు, ఎందుకు చంపారు?

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు కే.ఆర్మ్​స్ట్రాంగ్​ ను ఆరుగురు సభ్యుల ముఠా శుక్రవారం చెన్నైలోని ఆయన ఇంటి సమీపంలో నరికి చంపింది. ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం దోషులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

పెరంబూరులోని తన ఇంటి సమీపంలో చెన్నై కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ ఆర్మ్​స్ట్రాంగ్​ మీద, ద్విచక్రవాహనంపై వచ్చిన ముఠా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారని, అనుమానితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

"తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు కే.ఆర్మ్​స్ట్రాంగ్​ను ఆయన చెన్నై ఇంటి బయట అత్యంత కిరాతకంగా హత్య చేయడం అత్యంత శోచనీయం, ఖండించదగినది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన రాష్ట్రంలో బలమైన దళిత గొంతుకగా గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులను శిక్షించాలి,' అని మాయావతి డిమాండ్ చేశారు.

ఎవరు ఈ కే. ఆర్మ్​స్ట్రాంగ్​?

  1. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పూర్తి చేసిన కే.ఆర్మ్​స్ట్రాంగ్ చెన్నై కోర్టుల్లో న్యాయవాద వృత్తి చేశారు. మొదట 2006లో కార్పొరేషన్ కౌన్సిలర్​గా పనిచేశారు.
  2. ఆ తర్వాతి సంవత్సరంలో బిఎస్పీ తమిళనాడు విభాగానికి అధ్యక్షుడయ్యారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
  3. నాటి ఎన్నికల్లో గెలవకపోయినా గణనీయమైన మద్దతును పొందాడు.
  4. తన కెరీర్ అంతటా, ఆయన దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు.
  5. బీఎస్పీకి చెన్నైలో రాజకీయ ఉనికి లేకపోయినా, న్యాయవాది అయిన అర్మ్​స్ట్రాంగ్ సుపరిచితమైన దళిత గొంతుకగా నిలిచారు.

10 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు..

కే. ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసు దర్యాప్తు కోసం చెన్నై పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

జూలై 5వ తేదీ సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్​స్ట్రాంగ్ (52) పెరంబూరు (కె-1 సెంబియం పీఎస్ పరిధి) వేణుగోపాల్ సామి కోవిల్ వీధిలో ఆయన ఇంటి ముందు నిల్చొని ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడి కారణంగా రక్తస్రావమైన గాయాలతో పడి ఉన్న ఆయన్ని మార్గమధ్యలో ఉన్నవారి సాయంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఆయన్ని పరీక్షించిన వైద్యులు ఆర్మ్​స్ట్రాంగ్​ మృతి చెందినట్లు ప్రకటించారు,' అని చెన్నై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు ఆస్రా గార్గ్ ఐపీఎస్, అడిషనల్ కాప్ (నార్త్) ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.

ప్రతిపక్షాల నుంచి స్పందనలు..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి మృతిపై అధికార డీఎంకే పార్టీపై అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి మండిపడ్డారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టి, ఇది బాధాకరమని పళనిస్వామి ట్వీట్ చేశారు. బీఎస్పీ కార్యకర్తలకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హత్యకు గురైతే డీఎంకే పాలనలో శాంతిభద్రతలను విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నేరస్థులకు చంపే ధైర్యం ఎలా వస్తుంది? పోలీసులు, ప్రభుత్వం, చట్టానికి భయపడకుండా నేరాలు చేసే స్థాయికి శాంతిభద్రతలను పెంచిన డీఎంకే అధినేతను తీవ్రంగా ఖండిస్తున్నాను.

హంతకులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మా బీజేపీ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. ఇవాళ ఓ దళిత నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆర్మ్​స్ట్రాంగ్ ఒక జాతీయ పార్టీలో యువ, చురుకైన నాయకుడు' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. హంతకులను వెంటనే అరెస్టు చేసేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం