August rainfall: ఆగస్ట్ లో సాధారణం కన్నా తక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం-august rainfall could be below normal says private weather forecaster skymet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  August Rainfall: ఆగస్ట్ లో సాధారణం కన్నా తక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం

August rainfall: ఆగస్ట్ లో సాధారణం కన్నా తక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం

HT Telugu Desk HT Telugu
Aug 04, 2023 05:01 PM IST

‘August rainfall: ఈ ఆగస్ట్ నెలలో సాధారణం కన్నా తక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కై మెట్ (Skymet) వెల్లడించింది. సగటు వర్షపాతం ఆగస్ట్ లో సాధారణం కన్నా తక్కువగా, 90% ఉండవచ్చని పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

‘August rainfall: ఈ ఆగస్ట్ నెలలో సాధారణం కన్నా తక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కై మెట్ (Skymet) వెల్లడించింది. సగటు వర్షపాతం ఆగస్ట్ లో సాధారణం కన్నా తక్కువగా, 90% ఉండవచ్చని పేర్కొంది. వర్షాకాలానికి సంబంధించినంత వరకు ఆగస్ట్ నెల చాలా కీలకం. ఈ నెలలో కురిసే వర్షాలు వ్యవసాయ పరిస్థితులను నిర్దేశిస్తాయి.

జులై లో అధిక వర్షపాతం

జులై లో నెలలో దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశారు. భారీగా పంట నష్టానికి, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహించి, సమీప జనావాసాలను ముంచేశాయి. యమునా నది ప్రవాహ పెరిగి, ఢిల్లీని వరద ముంచెత్తింది. జులై నెలలో సాధారణం కన్నా 28% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, ప్రాంతాల వారీగా చూస్తే, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైనట్లు అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో అధిక వర్షపాతం నమోదవగా, తూర్పు, ఈశాన్య భారతదేశంలో అల్ప వర్షపాతం నమోదయింది.

ఎల్ నినో ప్రభావం..

కానీ, ఆగస్ట్ నెలలో మాత్రం సాధారణ వర్షపాతం కన్నా తక్కువనే నమోదువుతుందని భావిస్తున్నారు. ఎల్పీఏ (long period average LPA)లో 90% సగటు వర్షపాతం నమోదు కావచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కై మెట్ (Skymet) ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు. ఆగస్ట్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సాధారణం కన్నా తక్కువగా 94% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఎల్ నినో సగటు వర్షపాతంపై ప్రభావం చూపుతుంది. సముద్ర ఉపరితలాలపై ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి. భూమిపై పొడి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి.

Whats_app_banner