Anant-Radhika : లగ్జరీ రిసార్ట్‌లో అనంత్, రాధిక.. ఇక్కడ ఒక్క రాత్రి ఖర్చు 19 లక్షలు.. హనీమూన్ వెళ్లారా?!-anant ambani radhika merchant honeymooning at costa rica resort 19 lakhs for one night what reports say ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Anant-radhika : లగ్జరీ రిసార్ట్‌లో అనంత్, రాధిక.. ఇక్కడ ఒక్క రాత్రి ఖర్చు 19 లక్షలు.. హనీమూన్ వెళ్లారా?!

Anant-Radhika : లగ్జరీ రిసార్ట్‌లో అనంత్, రాధిక.. ఇక్కడ ఒక్క రాత్రి ఖర్చు 19 లక్షలు.. హనీమూన్ వెళ్లారా?!

Anand Sai HT Telugu
Aug 08, 2024 06:14 AM IST

Anant Ambani-Radhika Merchant : అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరు ప్రస్తుతం హనీమూన్ కోసం కోస్టారికాకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్

దేశం మెుత్త ఆశ్చర్యపోయేలా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరిగింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద సెలబ్రెటీలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కోట్లు ఖర్చు పెట్టి ముఖేష్ అంబానీ ఈ వెడ్డింగ్ జరిపించారు. నెలలపాటు ఈ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. చాలా రోజులు దేశమంతా ఈ వివాహం గురించే మాట్లాడుకుంది. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలను ముగించిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ 2024కి హాజరయ్యారు.

అనంత్, రాధిక పారిస్ ఒలింపిక్స్‌లో కనిపించిన తర్వాత హనీమూన్ కోసం కోస్టారికాకు వెళ్లినట్లు కోస్టారికన్ ప్రచురణ నివేదించింది. నూతన వధూవరులు ఆగస్టు 1న కోస్టారికాకు చేరుకున్నారని సెంట్రల్ అమెరికన్ కంట్రీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మైగ్రేషన్‌ని ఉటంకిస్తూ ది టికో టైమ్స్ నివేదించింది. నివేదిక ప్రకారం వారు కాసా లాస్ ఓలాస్ అనే లగ్జరీ ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో బస చేసినట్లు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియదు.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గత నెలలో ముంబైలో రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కొత్త జంట గత వారం పారిస్‌కు నీతా, ముఖేష్ అంబానీతో కలిసి వెళ్లారు. అనేక ప్రదేశాలలో కనిపించారు. వారు పారిస్ ఒలింపిక్స్ 2024కు హాజరైనట్లు కూడా అగుపించారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అందులో భాగంగా పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నారు.

కోస్టా రికాలో విల్లా గురించి

కాసా లాస్ ఓలాస్ బై ఫోర్ సీజన్స్ అనేది ఆరు పడకగదుల, 18,475 చదరపు అడుగుల విస్తీర్ణంలో పసిఫిక్ మహాసముద్రానికి అభిముఖంగా ఉన్న రిసార్ట్. దాని వెబ్‌సైట్ ప్రకారం, ఈ స్టార్ వసతి గృహంలో ఒక రాత్రికి మొత్తం విల్లాను బుక్ చేసుకునే ధర 23,000 డాలర్ల కంటే తక్కువ కాకుండా ప్రారంభమవుతుంది. రిసార్ట్ రుసుము, పన్నులు అన్ని కలిపి ఇంత అవుతుంది.

దాని వెబ్‌సైట్ ప్రకారం, ప్రాపర్టీలో బంక్ బెడ్‌లు, రీడింగ్ నూక్స్‌తో పూర్తిగా అమర్చబడిన పిల్లల గది, అత్యాధునిక మీడియా గది, జిమ్, 100 అడుగుల (30.48 మీటర్లు) స్విమ్మింగ్ పూల్ చుట్టూ భారీ బహిరంగ వినోద ప్రదేశం ఉంది. అతిథులు తమకు ప్రైవేట్ చెఫ్‌ను నియమించుకోవచ్చు. ప్రైవేట్ బార్‌తో పాటు యోగా, మెడిటేషన్, స్పిన్ క్లాస్‌లు, ఇతర వర్కౌట్‌ల కోసం వ్యక్తిగత శిక్షకుని సేవలను స్వీకరించవచ్చు. అయితే ఇందుకోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.