Amarnath Yatra 2024 : జూన్​ 29 నుంచి అమర్​నాథ్​ యాత్ర- పూర్తి వివరాలు..-amarnath yatra 2024 to begin from june 29 check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra 2024 : జూన్​ 29 నుంచి అమర్​నాథ్​ యాత్ర- పూర్తి వివరాలు..

Amarnath Yatra 2024 : జూన్​ 29 నుంచి అమర్​నాథ్​ యాత్ర- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Apr 14, 2024 05:21 PM IST

Amarnath Yatra 2024 registration : అమర్​నాథ్​ యాత్ర 2024పై కీలక అప్డేట్​ ఇచ్చింది.. శ్రీ అమర్​నాథ్​జీ ఆలయ బోర్డు. యాత్ర ప్రారంభం- ముగింపు తేదీలతో సహా అడ్వాన్స్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియపై వివరాలను వెల్లడించింది.

జూన్​ 29న అమర్​నాథ్​ యాత్ర ప్రారంభం..
జూన్​ 29న అమర్​నాథ్​ యాత్ర ప్రారంభం.. (AP)

Amarnath Yatra 2024 registration date : పవిత్ర అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన కీలక్​ అప్డేట్​! ఈ ఏడాది జూన్​ 29న.. అమర్​నాథ్​ యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు రెండు నెలల తర్వాత.. ఆగస్ట్​ 19తో ఈ పవిత్ర యాత్ర ముగుస్తుంది. అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన అడ్వాన్స్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ.. ఈ నెల 15న మొదలవుతుంది. ఈ మేరకు.. శ్రీ అమర్​నాథ్​జీ ఆలయ బోర్డు తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.

అమర్​నాథ్​ యాత్ర కోసం కసరత్తులు..

జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్​ఎఫ్​), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్​ఎఫ్​​) సభ్యులు.. అమర్​నాథ్​ యాత్ర 2024 ఆశాంతా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం.. ఎంఆర్​టీ (మౌంటైన్​ రెస్క్యూ టీమ్స్​) నుంచి వీరు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. జమ్ముకశ్మీర్​ పోలీస్​, ఎస్డీఆర్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​ సభ్యులతో కూడిన ఎంఆర్​టీలను.. పవిత్ర అమర్​నాథ్​ ఆలయానికి దారి తీసే రెండు మార్గాల్లో మోహరిస్తారు అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఈ బృందాలు చర్యలు చేపడతాయి.

Amarnath Yatra 2024 date : "జూన్​లో మొదలయ్యే శ్రీ అమర్​నాథ్​ యాత్ర.. రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా.. లక్షలాది మంది భక్తులు అమర్​నాథుడిని చూడటానికి వస్తారని భావిస్తున్నాము. యాత్రలో భక్తులకు ప్రకృతిపరమైన ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితులను టాకిల్​ చేసేందుకు.. మౌంటైన్​ రెస్క్యూ టీమ్స్​ని సిద్ధం చేస్తున్నాము. ఈ టీమ్స్​.. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాయి," అని ఎంఆర్​టీ ఇన్​ఛార్జ్​ రామ్​ సింగ్​ సలాథియా తెలిపారు.

"కీలక, సున్నితమైన ప్రాంతాల్లో ఎంఆర్​టీలను మోహరిస్తాము. ఎమర్జన్సీ సమయంలో భక్తులకు వారు వెంటనే సాయం చేస్తారు. అంతేకాదు.. సరికొత్త టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు టెస్ట్​ చేస్తున్నాము. వాటిని కూడా ఉపయోగిస్తాము," అని రామ్​ సింగ్​ అన్నారు.

Amarnath Yatra 2024 start date : "ఈ బృందాలు.. ప్రతియేటా వేలాది మంది భక్తులకు సాయం చేస్తున్నాయి. టీమ్​ సభ్యులను చూస్తే నాకు గర్వంగా ఉంది. వరద, అగ్ని, కొండచరియలు విరిగిపడటం, రోడ్డు ప్రమాదాలు వంటి విషయాలపై వీరు ట్రైనింగ్​ తీసుకుంటున్నారు," అని రామ్​ సింగ్​ స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్​ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సైనికులు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని రామ్​ సింగ్​ అన్నారు.

అమర్​నాథ్​ యాత్రను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతియేటా లక్షలాది మంది భక్తులు.. అమరనాథుడి దర్శనం కోసం జమ్ముకశ్మీర్​కి వెళుతూ ఉంటారు.

ఛార్​దామ్​ ఆలయాలు..

Amarnath Yatra 2024 registration fee : గంగోత్రి ధామ్​ ఆలయ​ ఓపెనింగ్​పై ఇటీవలే ఒక కీలక అప్డేట్ వచ్చింది​. అక్షయ తృతియ సందర్భంగా.. 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు పోర్టల్స్​ ఓపెన్​ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.

ఇక యమునోత్రి ధామ్​ పోర్టల్స్​ ఓపెనింగ్​పై సంబంధిత ఆలయ అర్చకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం