NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ ఇతనే..! పెద్ద గ్యాంగే ఉంది!
Sanjeev Mukhiya NEET : బిహార్‌కు చెందిన సంజీవ్ ముఖియాను.. నీట్ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్నారు. ఎవరి ఈ సంజీవ్ ముఖియా?
Sanjeev Mukhiya NEET : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2024 పేపర్ లీక్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇక ఇప్పుడు.. వీటన్నింటి మధ్య.. సంజీవ్ ముఖియా అనే వ్యక్తి పేరు వార్తలకెక్కింది. నీట్ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ ఇతడే అని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఇంతకి ఎవరీ సంజీవ్ ముఖియా?
ఎవరు ఈ సంజీవ్ ముఖియా..?
బిహార్ నలంద జిల్లావాసి ఈ సంజీవ్ ముఖియా. ఇతనికి సంజీవ్ సింగ్ అనే పేరు కూడా ఉంది. అంతేకాదు.. పేపర్ లీక్ వ్యవహారంలో ఇతనికి అనుభవం కూడా ఉంది. నలంద కాలేజ్‌కు చెందిన నూర్‌సరై బ్రాంచ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో.. అనేకమార్లు పేపర్ లీక్‌లకు పాల్పడినట్టు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో సంచలనం సృష్టించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్లోనూ ఇతని హస్తం ఉంది.
రవి అత్రి అనే వ్యక్తితో కలిసి.. ఈ సంజీవ్ ముఖియా.. ఒక టీమ్‌ని నడిపిస్తుంటాడు. దాని పేరు 'సాల్వర్ గ్యాంగ్'! లీకైన క్వశ్చన్ పేపర్స్‌ని ఇవ్వడం లేదా ప్రాక్సీల చేత పరీక్షలు రాయించడం ఈ గ్యాంగ్ పని. వివిధ రాష్ట్రాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షల నుంచి టీచర్ నియామక పరీక్షల వరకు ఈ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు దర్యాప్తులో తేలింది.
Who is Sanjeev Mukhiya : ఇక అధికారుల ప్రకారం.. నీట్ యూజీ 2024 క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్స్ పంపకాలు ఈ సంజీవ్ ముఖియా మేనేజ్ చేశాడు. ఒక ప్రొఫెసర్ నుంచి వీటిని.. మొబైల్ ఫోన్స్ ద్వారా సంజీవ్ ముఖియా పొందాడు. ఆ ప్రొఫెసర్ ఎవరు? అనేది ఇంకా తెలియరాలేదు. అతడిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:- NEET Row: పేపర్ లీకేజీ కుట్రను ఛేదించిన బీహార్ పోలీసులు
కుమారుడికి కూడా అదే పని..!
ఈ సంజీవ్ ముఖియా భార్య మమతా దేవీ.. భుతఖర్ పంచాయత్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. లోక్‌జన్‌శక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఆ స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. ఇక.. వీరి కుమారుడు శివ్ కుమార్.. బిహార్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌కు సంబంధించిన పేపర్ లీక్ కేసులో లీగల్ కేసులు ఎదుర్కొంటున్నాడు!
NEET Paper Leak latest updates : అయితే.. సొంత గ్రామంలో సంజీవ్ ముఖియా కుటుంబానికి మంచి సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. సంజీవ్ ముఖియా.. వ్యవసాయం చేసుకునే సాధారణ వ్యక్తి అని, గ్రామం దాటి, ఇతర వ్యవహారాలపై అతనికి ఎలాంటి ప్రభావం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు.
అయితే.. సంజీవ్ ముఖియా ప్రస్తుతం ఇండియాలో లేడు! నీట్ పేపర్ లీక్ వివాదం తీవ్రం అవ్వడంతో.. అతను నేపాల్‌కి పారిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇండియా నేపాల్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల.. నేరస్తుల అప్పగింత ప్రక్రియ ఎంత సులభం కాదని ముఖియాకు తెలుసు!
సంబంధిత కథనం