Jaipur earthquake today : వరుస భూకంపాలతో ఉలిక్కిపడ్డ జైపూర్.. 30 నిమిషాల్లో మూడుసార్లు!
Jaipur earthquake today : వరుస భూకంపాలతో జైపూర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది!
Jaipur earthquake today : వరుస భూకంపాలతో రాజస్థాన్ జైపూర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో అరగంట వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
శుక్రవారం తెల్లవారుజాము 4:09 గంటలకు భూమికి 10కి.మీల దిగువన మొదటి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఆ తర్వాత 4:22 గంటలకు భూమికి 5 కి.మీల దిగువన 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరిగా.. తెల్లవారుజామున 4:25 గంటలకు 3.4 తీవ్రతతో భూమికి 10 కి.మీల దిగువన భూమి కంపించింది. అప్పటికే ప్రజలు భయంతో పరుగులు తీశారు.
జైపూర్ భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"జైపూర్‌లోని చాలా ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అందరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను," అని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ట్వీట్ చేశారు.
మణిపూర్‌లో కూడా..!
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్ అనే ప్రాంతంలో 5:01 గంటలకు 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని సమాచారం.
సంబంధిత కథనం