IISc Recruitment 2024 : బెంగళూరు ఐఐఎస్‌సీలో ఉద్యోగాలు, మంచి జీతం.. దరఖాస్తుకు మిగిలింది రెండు రోజులే
IISC Recruitment 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో రీసెర్చ్ డిపార్ట్‌మెంట్, బి.టెక్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్ట్‌లపై ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరులో 11 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బయాలజీ, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
పోస్టుల సంఖ్య : 11
జీవశాస్త్రం: 3
కెమిస్ట్రీ: 2
ఇంజనీరింగ్: 1
ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ : 1
భౌతికశాస్త్రం: 2
కంప్యూటర్ సైన్స్: 1
గణితం: 1
అర్హతలు
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ఖాళీకి సంబంధించిన సబ్జెక్టులో పీహెచ్‌డీ కలిగి ఉండాలి. రెండు సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీ పని అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ కంటే ముందు కూడా బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు.
IISc బెంగుళూరు రిక్రూట్‌మెంట్ 2024 పై పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ కింది విధంగా ఉంటుంది. ఇంటర్వ్యూ లేదా అవసరమైతే రాత పరీక్ష. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇ మెయిల్ ద్వారా కాల్ లెటర్‌లు వస్తాయి. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీని తరచుగా చెక్ చేసుకోవాలి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు IISc బెంగళూరు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. www.iisc.ac.in అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్, స్కాన్ చేసిన సంతకం, పేర్కొన్న పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.
నోటిఫికేషన్ తేదీ 21.11.2024న విడుదల చేశఆరు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 11.12.2024గా నిర్ణయించారు. ప్రాథమిక జీతం నెలకు రూ54,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది.