Canada: స్విమ్మింగ్ పూల్ లో పడి కెనడాలో భారతీయ విద్యార్థి మృతి-20yearold haryanas karnal resident dies after slipping into pool in canada ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Canada: స్విమ్మింగ్ పూల్ లో పడి కెనడాలో భారతీయ విద్యార్థి మృతి

Canada: స్విమ్మింగ్ పూల్ లో పడి కెనడాలో భారతీయ విద్యార్థి మృతి

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 02:59 PM IST

కెనడాలో ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి వెళ్లిన ఒక విద్యార్థి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ మేనేజ్ మెంట్ లో డిప్లొమా చేసేందుకు 20 ఏళ్ల ఆ యువకు 2023 డిసెంబర్ 12న స్టడీ వీసాపై కెనడా వెళ్లాడు. చదువుకుంటూ, ఓ కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు.

స్విమ్మింగ్ పూల్ లో పడి కెనడాలో భారతీయ విద్యార్థి మృతి
స్విమ్మింగ్ పూల్ లో పడి కెనడాలో భారతీయ విద్యార్థి మృతి

కెనడాలోని లండన్ సిటీలో భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. కాలు జారి, స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి, చనిపోయాడని అక్కడి అధికారులు ఆ యువకుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడు హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, అర్జున్ నగర్ కు చెందినవాడు.

స్టడీ వీసాపై వెళ్లి..

మృతుడిని నోమిత్ గోస్వామిగా గుర్తించారు. హోటల్ మేనేజ్ మెంట్ లో డిప్లొమా చేసేందుకు 2023 డిసెంబర్ 12న స్టడీ వీసాపై కెనడా వెళ్లిన ఆయన ఓ కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసుల ద్వారా తెలియజేశారు. ఆ యువకుడి తండ్రి నరేష్ గోస్వామి కర్నాల్ లోని సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ వార్తను విదేశాల్లో నివసిస్తున్న తన బంధువులు, స్నేహితులు ధృవీకరించారని నరేశ్ గోస్వామి తెలిపారు.

ప్లాట్ అమ్మి, డబ్బులు సమకూర్చి..

నోమిత్ ను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు తమ కుటుంబం ఒక ప్లాట్ ను విక్రయించి డబ్బును సమకూర్చిందని ఆయన చెప్పారు. మృతుడి తల్లి మాట్లాడుతూ పూల్ పార్టీలో చేరే ముందు అతనితో మాట్లాడానని, పూల్ కు దూరంగా ఉండాలని చెప్పానని చెప్పారు. కానీ అతను స్విమ్మింగ్ పూల్ లో జారిపడి చనిపోయాడని మాకు సమాచారం అందింది. కేవలం రెండు వారాల క్రితమే తన కుమారుడు ఓ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేరి చాలా హ్యాపీగా ఉన్నాడని ఆమె వాపోయారు.

అమెరికాలో తెలుగు విద్యార్థి

ఇటీవల అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ రాజ్ చికాగో మిస్సౌరీ ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో యువకుడు గల్లంతు ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రాజు శ్రీనాథరాజు (20) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

అమెరికాలో కాల్పులు-తెలుగు యువకుడు మృతి

అమెరికాలో ఇటీవల జ‌రిగిన‌ మరో కాల్పుల ఘటనలో ఏపీకి చెందిన యువ‌కుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాప‌ట్ల జిల్లా క‌ర్లపాలెం మండ‌లం యాజ‌లి గ్రామానికి చెందిన దాస‌రి గోపీకృష్ణ (32) అమెరికాలోని దుండ‌గుడి కాల్పుల్లో మ‌ర‌ణించాడు. గోపీకృష్ణ జీవ‌నోపాధి కోసం ఎనిమిది నెల‌ల క్రితం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అర్కెన్సాస్ రాష్ట్రంలోని సూప‌ర్ మార్కెట్లో ప‌నిచేస్తున్నాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం గోపీకృష్ణ కౌంట‌ర్‌లో ఉండ‌గా, ఓ దుండ‌గుడు నేరుగా వ‌చ్చి తుపాకీతో అత‌డిపై కాల్పులు జ‌రిపాడు. దీంతో తీవ్రగాయాల‌తో గోపీకృష్ణ అక్కడిక‌క్కడే కుప్పకూలిపోయాడు. అనంత‌రం దుండగుడు అక్కడి నుంచి ప‌రార‌య్యాడు. గోపీకృష్ణను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అక్కడ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.