Get rid of Ants: ఇంట్లో చీమలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న చిట్కాలతో వాటిని వదిలించుకోండి
Get rid of Ants: వాతావరణం చల్లబడిందంటే చాలు ఇంట్లోకి చీమలు వచ్చి చేరుతాయి. అన్నం నుంచి పంచదార వరకు ఏవి దొరికినా తింటూనే ఉంటాయి. ఇంట్లో నుంచి చీమలను వదిలించడానికి కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి.
Get rid of Ants: వేసవికాలంలో చీమలు ఎక్కువగా కనిపించవు. కానీ వాతావరణం చల్లబడగానే ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆహార పదార్థాల కోసం క్యూ కట్టి మరీ వెళుతూ ఉంటాయి. అన్నం మెతుకు గురించి పంచదార వరకు అన్నింటినీ ఎత్తుకుపోయే చీమలను వదిలించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఇంట్లోనే చిన్న చిట్కాల ద్వారా వీటిని బయటకి పంపించవచ్చు.
వైట్ వెనిగర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఇంటికి తెచ్చుకోండి. చీమలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ స్ప్రే చేయండి. వెనిగర్ గాఢతకు చీమలు తట్టుకోలేవు. మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాయి.
ఉప్పు, మిరియాల పొడి ఇంట్లోనే రెడీగా ఉంటుంది. ఎక్కడైతే చీమలు నివసిస్తున్నాయో అక్కడ మిరియాల పొడిని చల్లండి. లేదా ఉప్పుని చల్లండి. రెండూ కలిపి చల్లినా చీమలు అక్కడ ఉండలేక బయటికి వెళ్లిపోతాయి.
దాల్చిన చెక్క నుంచి వచ్చే వాసన కూడా చీమలకు నచ్చదు. కాబట్టి చీమలు ఉన్నచోట దాల్చిన చెక్క ముక్కను పెట్టండి. దాల్చిన చెక్క ఎక్కడ ఉంటుందో అటువైపు చీమలు రావు. అలాగే లవంగం మొగ్గలు కూడా చీమలు పట్టకుండా అక్కడక్కడా వేస్తే వాటిని వదిలించుకోవచ్చు.
అన్నిటికంటే సింపుల్ పద్ధతి నిమ్మరసం. పుల్లగా ఉండే నిమ్మరసం వాసన చీమలకు సరిపడదు. అందుకే నిమ్మరసాన్ని తీసి చిన్న స్ప్రే బాటిల్ లో వేయండి. ఎక్కడైతే చీమలు అధికంగా ఉన్నాయో అక్కడ ఆ నిమ్మరసాన్ని స్ప్రే చేయండి. మీ ఇల్లు వదిలి చీమలు పారిపోవడం గ్యారెంటీ.
చీమల మందు వద్దు
మార్కెట్లో దొరికే చీమల మందులు వంటివి వాడకపోవడమే మంచిది. ఆ రసాయనాలు మనకు తెలియకుండా గాలి ద్వారా ఆహారం పై పడవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో చీమల మందులు ఉండడం మంచి పద్ధతి కాదు. వారికి తెలియక అవి నోట్లో పెడితే ప్రాణాంతకంగా మారిపోతాయి. కాబట్టి మేము ఇక్కడ చెప్పిన చిన్న చిన్న చిట్కాలు ద్వారానే చీమలను బయటకు పంపించేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏ చీమరాదు. బయట ఫ్లోర్ మీద అన్నం మెతుకులు, పంచదార లాంటివి పడకుండా చూసుకోండి. మూతలు గట్టిగా పెట్టుకోండి. ఆహారం దొరకకపోతే ఆ ప్రదేశం నుంచి చీమలు దూరంగా వెళ్లిపోతాయి.
టాపిక్