Triumph Tiger 1200 | రయ్యుమని దూసుకొచ్చిన 'టైగర్'.. ధరెంతో తెలుసా?
2022 Triumph Tiger 1200 బైక్ భారత మార్కెట్లో విడుదలయింది. ఇది రెండు వేరియంట్లలో 4 ట్రిమ్ లలో లభ్యమవుతోంది. దీని ధరలు, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
రయ్యుమని దూసుకుపోయే స్పోర్ట్స్ బైక్ లను రూపొందించే ప్రముఖ మోటార్‌సైకిల్ మేకర్ ట్రయంఫ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022 'ట్రయంఫ్ టైగర్ 1200' బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి GT వేరియంట్ కాగా, మరొకటి Rally. వీటి పేర్లకు తగినట్లుగా Rally బైక్ కఠినమైన దారుల కోసం రూపొందించిన ఆఫ్-రోడ్ బయాస్డ్ వేరియంట్. ఇక GT బైక్ సాధారణంగా రహదారులు, సిటీ రోడ్లకు అనుగుణంగా రూపొందించిన వేరియంట్.
ట్రయంఫ్ ప్రతి వేరియంట్‌లోనూ టైగర్ 1200ని రెండు ట్రిమ్‌లలో అందిస్తుంది. అవి టైగర్ 1200 GT ప్రో, రెండోది GT ఎక్స్‌ప్లోరర్. అలాగే ర్యాలీ ప్రో ఇంకా ర్యాలీ ఎక్స్‌ప్లోరర్. ఇందులో ప్రో మోడల్ బైక్స్ 20-లీటర్ ఇంధన ట్యాంకులను కలిగి ఉండి, సుమారు 400 కి.మీ పరిధిని కవర్ చేయగలవు. మరోవైపు ఎక్స్‌ప్లోరర్ మోడెల్ బైక్స్ 30-లీటర్ ఇంధన ట్యాంకులను కలిగి ఉండి సుమారు 600 కి.మీ పరిధిని అందిస్తాయి.
టైగర్ 1200 GT బైక్‌లకు ముందు, వెనక అలాయ్ వీల్స్ ఇచ్చారు, ఎక్స్‌ప్లోరర్ రకం బైక్‌లకు రెండు వైపులా స్పోక్డ్ వీల్స్ ఇచ్చారు. ట్రయంఫ్ మునుపటి బైక్‌లతో పోలిస్తే ఈ సరికొత్త 'టైగర్ 1200' మోడెల్ సుమారు 25 కిలోల బరువు తక్కువగా ఉంటుంది.
ఫీచర్లు - స్పెసిఫికేషన్లు
ఇంజన్, ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. టైగర్ 1200 బైక్‌లో 1,160 cc ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఇచ్చారు, దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు.
అలాగే ఫుల్-LED లైటింగ్, బ్లూటూత్-ఎనేబుల్ కలర్-TFT డిస్‌ప్లే, కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ రాడార్ సిస్టమ్, లేన్ చేంజ్ అసిస్ట్ ఫీచర్‌తో పాటు సర్దుబాటు చేసుకునే సీట్ ఉన్నాయి.
టైగర్ 1200 ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 19.19 లక్షల నుంచి రూ. 21.69 లక్షల వరకు ఉన్నాయి.
సంబంధిత కథనం