Healthy Habits | ఈ చిన్ని చిట్కాలతో ఎన్నో ప్రయోజనాలు.. -top 5 healthy eating habits for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Habits | ఈ చిన్ని చిట్కాలతో ఎన్నో ప్రయోజనాలు..

Healthy Habits | ఈ చిన్ని చిట్కాలతో ఎన్నో ప్రయోజనాలు..

HT Telugu Desk HT Telugu
Apr 05, 2022 07:48 AM IST

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం.. ఆహారంలో మార్పులు చేయాలి అనుకుంటారు. ఎంత గణనీయమైన మార్పులు చేస్తే.. అంత గణనీయమైన ఫలితాలు వస్తాయని భావిస్తారు. కానీ చిన్న చిన్న మార్పులతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఆహారంలో గణనీయమైన మార్పులు చేయడానికి బదులుగా.. ఆరోగ్యంగా ఉండటానికి వారి ఆహారంలో ఈ ఐదు చిన్న మార్పులను చేయమంటున్నారు.

ఆరోగ్యానికి 5 చిట్కాలు
ఆరోగ్యానికి 5 చిట్కాలు

Eating Habits | మంచి ఆహారం, పండ్లు, కూరగాయలు.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మనల్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఒకేసారి భారీ మార్పులు అంటే అందరికీ కష్టమే. అందుకే ఆహారంలో గణనీయమైన మార్పులు చేయడానికి బదులు.. చిన్న చిన్న వాటితో రోజు ప్రారంభించడం మంచిది అంటున్నారు.

1. ఆహారాన్ని ఆస్వాదించండం

మీ ఆహారాన్ని ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తినే ఆహారాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారు పెరిగే బరువును కూడా ప్రభావితం చేస్తుంది. ఓ నివేదిక ప్రకారం.. స్లోగా తినేవారి కంటే.. వేగంగా తినేవారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నిదానంగా తినడం వల్ల కడుపు నిండుగా ఉందని మెదడు గ్రహిస్తుంది. తద్వారా తక్కువ తింటాము.

2. ప్రోటీన్ తీసుకోవడం 

ప్రోటీన్స్​లో కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి వారి కండర ద్రవ్యరాశిని నిలిపి ఉంచడంలో ప్రోటీన్​లు సహాయపడతాయి. రోజూ కరిగించే కేలరీల సంఖ్యను కొద్దిగా పెంచుతుంది. పైగా ప్రోటీన్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే అవి ఒక వ్యక్తి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి చెందేలా.. తినాలనిపించే కోరికలను అరికట్టడానికి సహాయపడతాయి.

3. ఇంట్లోని భోజనం

బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. తెలిసినా.. బయట తినే వాటికే మొగ్గు చూపుతారు చాలమంది. కానీ ఇంట్లో వండిన భోజనం తింటే.. అనవసర ఖర్చు ఉండదు. పైగా అనారోగ్యకరమైన లేదా అధిక కేలరీల పదార్థాలు ఉండే అవకాశం చాలా తక్కువ.

4. చురుకుగా ఉండడం

వ్యాయామం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. అదనంగా, ప్రతిరోజూ మీ శరీరాన్ని కదిలించడం చాలా అవసరం. దీనికోసం జిమ్​లకు వెళ్లాల్సిన అవసరమేమి లేదు. యోగా, ఇంటి పనులు చేయడం, రోజువారీ నడకలు (పెంపుడు జంతువులతో), పిల్లలతో ఆడుకోవడం వంటి ఇతర కార్యకలాపాలతోనూ.. చురుకుగా ఉండవచ్చు.

5. ఆరోగ్యకరమైన నూనెలు..

కొన్ని దశాబ్దాలుగా సోయాబీన్, పత్తి గింజలు, పొద్దుతిరుగుడు నూనెలతో సహా.. అధికంగా ప్రాసెస్ చేయబడిన విత్తనం, కూరగాయల నూనెలు గృహోపకరణాలుగా మారాయి. ఈ నూనెలు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. కానీ గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఒమేగా-3లు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆలివ్ నూనె, అవకాడో నూనె లేదా కొబ్బరి నూనె ప్రత్యమ్నాయాలుగా చెప్పవచ్చు. భారతీయ నూనెలలో నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, మస్టర్డ్ ఆయిల్ మంచి ఆరోగ్యం కోసం వినియోగించవచ్చని సూచిస్తున్నారు.

వీటితో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి అంటున్నారు. సకాలంలో ఆరోగ్య పరిస్థితులను గుర్తించడంలో, నిర్ధారణ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం అనారోగ్యంతో ఉంటే.. 25 ఏళ్ల తర్వాత రెగ్యులర్ స్క్రీనింగ్ చేయాలి. జన్యు, శారీరక, పర్యావరణ, ప్రవర్తనా కారకాల కలయికతో ఏర్పడిన వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్