Zodiac Signs | ఈ రాశుల వారికి అభద్రతా భావం ఎక్కువ.. ఆత్మవిశ్వాసం తక్కువ-these five zodiac sign people who are feeling insecure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zodiac Signs | ఈ రాశుల వారికి అభద్రతా భావం ఎక్కువ.. ఆత్మవిశ్వాసం తక్కువ

Zodiac Signs | ఈ రాశుల వారికి అభద్రతా భావం ఎక్కువ.. ఆత్మవిశ్వాసం తక్కువ

Maragani Govardhan HT Telugu
Feb 28, 2022 04:38 PM IST

మనపై మనకు విశ్వాసం లేనప్పుడే ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఫలితంగా అవి జీవితంలో ముందుకు వెళ్లకుండా అవరోధాలుగా నిలువరిస్తాయి. "మనపై మనకు నమ్మకం లేనప్పుడే భగవంతుడిని అధికంగా నమ్ముతాం" అని ఓ సినీ కవిచెప్పినట్లు.. ఈ అభద్రతా భావం కూడా మనిషి విశ్వాసాన్ని కుంగదీస్తుంది.

<p>రాశులు</p>
రాశులు (Hindustan times)

Zodiac Signs.. మనిషి జీవితం కష్ట, సుఖాల సమాహారం. సుఖాలొచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టాలొచ్చినప్పుడు కుంగిపోవడం చేయకుండా జీవితాన్ని సమతులం చేసుకునేవారే సక్సెస్ అవుతారు. అప్పుడే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అయితే కొంతమంది ఇందుకు విరుద్ధంగా ప్రతి విషయానికి భయపడుతుంటారు. ముఖ్యంగా అభద్రత, అపనమ్మకం లాంటి భావనలతో సతమతమవుతుంటారు. మనపై మనకు విశ్వాసం లేనప్పుడే ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఫలితంగా అవి జీవితంలో ముందుకు వెళ్లకుండా అవరోధాలుగా నిలువరిస్తాయి. "మనపై మనకు నమ్మకం లేనప్పుడే భగవంతుడిని అధికంగా నమ్ముతాం" అని ఓ సినీ కవిచెప్పినట్లు.. ఈ అభద్రతా భావం కూడా మనిషి విశ్వాసాన్ని కుంగదీస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇలాంటి లక్షణాన్ని కలిగిన కొన్ని రాశుల వాళ్లున్నారు. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

కర్కాటకం..

ఈ రాశి ప్రజలు చాలా సున్నిత మనస్కులు. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంగా ఉండలేరు. ఫలితంగా ఎక్కువగా ఇతరులపై ఆధారపడుతుంటారు. మీరు సంతోషంగా ఉండాలన్నా, మీకు మంచి అనుభూతి కలగాలన్నా ఇతరుల డామినేషన్​ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కేరింగ్ గా ఉండటం, అప్రమత్తంగా వ్యవహరించడం లాంటి లక్షణాలు మీరు అభద్రతా భావంలో ఉన్నారని సూచిస్తాయి.

కన్య..

వీళ్లు ప్రతి విషయంలోనూ పర్ఫెక్షనిస్టుగా ఉండాలని అనుకుంటారు. ఈ లక్షణాన్ని కలిగి ఉండటం అభినందనీయమే కానీ కొన్నిసార్లు ఇది మీ ఆత్మగౌరవానికి హాని కలిగిస్తుంది. అంతేకాకుండా మీలో ఉన్న పాజిటివ్ అంశాలను పక్కనపెట్టి.. చిన్నదానికి, పెద్దదానికి మిమ్మల్ని మీరు విమర్శించుకుంటారు. ఇది మితిమీరితే కొన్నిసార్లు అవమానాలకు గురయ్యే అవకాశముంటుంది. మీ సామర్థ్యాలపై మీరే అభద్రతా భావానికి లోనయ్యేలా చేస్తుంది.

తుల..

ఈ రాశి వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మౌనంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ ఆందోళనను ముఖంపై కనిపించనీయకుండా నిలకడగా ఉంటారు. స్వభావరీత్యా సిగ్గరి. బహిరంగ సమావేశాల్లో, సమూహాల్లో మీ అభిప్రాయాలను పంచుకోవడాన్ని ఇష్టపడరు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటారో అని, తప్పుగా అర్థం చేసుకుంటారని అభద్రతా భావంతో ఉంటారు.

మీనం..

 

ఎదుటి వారికి చెందిన ప్రతి విషయాలను ఎంతో ఓపికగా వింటారు. వారికి ఏం కావాలో తెలుసుకుంటారు. వారిని నొప్పించడం ఇష్టం ఉండదు. ఈ కారణంగా సులభంగా నో అని చెప్పలేరు. ఇదే విషయం మీ దగ్గరకు వస్తే మాత్రం వెనకడుగు వేస్తారు. ఇతరుల ముందు మీ అభిప్రాయాలను చెప్పేందుకు జంకుతారు. స్వభావరీత్యా మీరు చాలా కేరీంగ్ గా ఉంటారు. కానీ ఇది మితిమీరినప్పుడు అభద్రతా భావానికి లోనయ్యే అవకాశముంది. కాబట్టి ఇతరులకు బదులు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి.

మకరం..

వృత్తిగత జీవితంలో మీరు చాలా నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలోనే ఆ విధంగా ఉండలేరు. ఎప్పుడూ అభద్రతా భావంతో, రిజర్వ్​డ్​గా ఉంటారు. ఎదుటివారు వస్తే మీకు హాని కలిగస్తారనే భయంతో మీ ఫీలింగ్స్​ను అస్సలు బయటపెట్టరు. మీకంటూ ఓ గోడ కట్టుకుని జీవిస్తారు. ఈ విధంగా ఉండటం వల్ల సమాజంలో అందరితో కలిసి ఉండటాన్ని ఆస్వాదించలేరు. సోషల్ స్కిల్స్ గురించి ఎప్పుడూ అభద్రతా భావానికి లోనవుతారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం