Philosophy Of Japanese : మీరు 100 ఏళ్లు బతకాలా? జపనీస్ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వండి-the philosophy of japanese how to live 100 years follow this japanese ikigai lifestyle ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  The Philosophy Of Japanese How To Live 100 Years Follow This Japanese Ikigai Lifestyle

Philosophy Of Japanese : మీరు 100 ఏళ్లు బతకాలా? జపనీస్ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu
Feb 24, 2023 10:26 AM IST

Ikigai Japanese Lifestyle : ప్రపంచంలో ఎక్కువగా ఆనందంగా ఉండేది జపాన్ ప్రజలు. ఎక్కువ కాలం కూడా జీవించేది వాళ్లే. మంచి ఆరోగ్యం, మెరుగైన జీవితం కోసం జపాన్ ప్రజల రహస్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడి ప్రజలు 'ఇకిగై' అనే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జపాన్ ప్రజలు(Japan People) చాలా సంతోషంగా జీవిస్తుంటారు. వాళ్లు ఈ క్షణం ఆనందంగా ఉండటాన్నీ ఆలోచిస్తారు. అందుకే వాళ్లు ఆనందంతోపాటుగా.. ఎక్కువ కాలం జీవిస్తారు. పూర్తి, యవ్వనంగా ఉండేందుకు లోపల నుండి సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. జపనీస్(Japanese) ప్రజల దీర్ఘాయువు రహస్యం కూడా అదే. జపాన్‌లో చాలా మంది ప్రజలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారని మీకు తెలుసా? మంచి ఆరోగ్యం, మెరుగైన జీవితం కోసం వారి రహస్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

జపనీయుల ఆహారంలో చేపలు(Fish) తప్పనిసరి. మనం కచ్చితంగా టీ తాగుతాం. కానీ వారు తియ్యటి పాల టీకి బదులుగా గ్రీన్ టీ(Green Tea)ని తాగడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఐదు కప్పుల గ్రీన్ టీ తాగే వారి మరణాల రేటు 26 శాతం తక్కువగా ఉంటుంది.

ఇది కాకుండా, వారు ఎక్కువగా ఆకు కూరలు తింటారు. జపనీయులు తూర్పు ప్రాంతాల కంటే 6 రెట్లు ఎక్కువ అన్నం తింటారు. వారి ఒక సారి భోజనంలో నాలుగు కూరగాయలు ఉంటాయి. ప్రత్యేక సందర్భం ఉన్నప్పుడే పంది మాంసం తింటారు.

జపాన్‌(Japan)లోని ఒకినావా నగరం గురించి చెప్పాలంటే అక్కడి ప్రజలు 'ఇకిగై' అనే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతారు. జీవితానికి కొంత అర్థం ఉండేలా, జీవించడానికి విలువైనదిగా ఉండాలని ఇది చెబుతుంది. వారు ఒకరినొకరు బాగా పరిశీలించుకుంటారు. మానవులు, జంతువులు, మొక్కలు ఇలా వాటిని కూడా పరిశీలిస్తారు. దీనికి కారణం ఇతరుల గురించి ఆలోచించడం ద్వారా.., ఒకరి స్వంత సమస్యల వైపు దృష్టిని వెళ్ళదని నమ్ముతారు.

జపనీస్ ప్రజలు పాడటంపై చాలా నమ్మకం కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 20,000 మంది పురుషులపై చేసిన పరిశోధనలో పాడటం(Singing), స్నేహితులతో(Friends) మాట్లాడటం మన హృదయాలను ఆరోగ్యంగా ఉంచుతుందని వెల్లడించింది. ఎందుకంటే పాడేటప్పుడు లోతైన శ్వాస తీసుకోవాలి. దీనితో పాటు, పాట విని ప్రజలు చప్పట్లు కొట్టినప్పుడు, మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఒత్తిడి(Stress) తగ్గుతుంది. కష్టకాలంలో మనల్ని ఓదార్చేది మన స్నేహితులే అని నమ్ముతారు. పెద్దలను గౌరవించడం, వారి ప్రేమను పొందడం దీర్ఘాయువును ఇస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.

గతంలో జరిగిన చెడు విషయాలను గుర్తుంచుకోవడం హృదయాన్ని బాధపెడుతుందని జపనీయులకు బాగా తెలుసు. గతానికి సంబంధించిన బాధను ఆలోచిస్తే.. మంచి ఏమీ జరగదు. అందుకే వారు ఈరోజు ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారు. వారు ఇతర వ్యక్తులతో సులభంగా స్నేహం చేస్తారు.

WhatsApp channel