Sweetcorn paratha: పిల్లలకు స్వీట్ కార్న్ పరోటా పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు-sweetcorn paratha recipe in telugu know how to make this paratha recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweetcorn Paratha: పిల్లలకు స్వీట్ కార్న్ పరోటా పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు

Sweetcorn paratha: పిల్లలకు స్వీట్ కార్న్ పరోటా పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు

Haritha Chappa HT Telugu
Jan 27, 2024 06:00 AM IST

Sweetcorn paratha: స్వీట్ కార్న్‌తో పరోటా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నిత్యం చేసే పరోటాలతో పోలిస్తే ఇది భిన్నమైన రుచిని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు స్వీట్ కార్న్ పరోటా నచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

స్వీట్ కార్న్ పరోటా
స్వీట్ కార్న్ పరోటా (pexels)

Sweetcorn paratha: పరోటాలను గోధుమ లేదా మైదాతోనే చేస్తారు. నిజానికి మైదా కన్నా గోధుమనే మాడడం మంచిది. మైదాను పూర్తిగా వాడడం మానేయడమే ఉత్తమం. ఇక్కడ మేము స్వీట్ కార్న్ తో చేసిన పరోటా రెసిపీ ఇచ్చాము. ఇది పిల్లలకి ఎంతో నచ్చుతుంది. అప్పుడప్పుడు చేస్తే స్నాక్ గా కూడా తినవచ్చు.

స్వీట్ కార్న్ పరోటాకు రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - ఒక కప్పు

స్వీట్ కార్న్ - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

జీలకర్ర - ఒక స్పూను

ఇంగువ పొడి - చిటికెడు

ఉల్లిపాయ తరుగు - మూడు స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు - అర స్పూను

అల్లం తరుగు - అర స్పూను

వెల్లుల్లి తరుగు - అర స్పూను

వాము - పావు స్పూను

కొత్తిమీర తరుగు - అర స్పూను

నూనె - వేయించడానికి సరిపడా

స్వీట్ కార్న్ పరోటా రెసిపీ

1. గోధుమ పిండిని ఎప్పుడులాగే చపాతీ పిండిలా కలుపుకోండి.

2. దాన్ని తడి బట్టలో చుట్టి ముప్పావు గంట సేపు పక్కన పెట్టండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

4. అందులో జీలకర్ర, ఉల్లిపాయల తరుగు, ఇంగువ పొడి వేసి వేయించండి.

5. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, వాము, కొత్తిమీర తరుగు, స్వీట్ కార్న్ వేసి బాగా కలపండి.

6. అందులోని తడి ఇంకిపోయేదాకా చిన్న మంట మీద కలపండి.

7. ఇప్పుడు గోధుమ పిండిని ముద్దలుగా తీసుకొని పూరీల్లా ఒత్తుకోండి.

8. స్వీట్ కార్న్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి ఆ రొట్టెను మడిచి మళ్లీ రోల్ చేయండి. ఇవి మందంగా వస్తాయి.

9. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. ఒత్తిన పరోటాను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

10. అంతే టేస్టీ స్వీట్ కార్న్ పరోటా రెడీ అయినట్టే. దీన్ని తుంచితే స్వీట్ కార్న్ బయటికి వస్తుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీనికి ఎలాంటి చట్నీలు అవసరం లేదు.

WhatsApp channel

టాపిక్