Sunday Motivation : నీ నీడే వెలుగును బట్టి మారుతుంది.. నిన్ను నువ్ నమ్ముకో
Sunday Thoughts : జీవితంలో చాలామందిని నమ్మి మోసపోయా.. అందుకే ఏం చేయాలో అర్థం కాదు.. ఎవరిని నమ్మాలో అర్థం కాదు.. ఈ మాటలు తరచూ వినిపిస్తుంటాయి. ఎవరినో ఎందుకు నమ్మడం.. నిన్ను నువ్ నమ్ముకుంటే చాలు.. ఎలాంటి బాధ ఉండదు.
జీవితం మీద కంప్లైంట్స్ చాలా మందికి ఉంటాయి. అయితే ఆ ఫిర్యాదులు కూడా ఇతరుల మీదకే నెట్టేస్తారు. వాళ్లను నమ్మిమోసపోయాను.. వీళ్లకు అన్ని విషయాలు చెప్పి.. చాలా ఇబ్బందులు పడ్డాను అని చెబుతుంటారు. ముందు నుంచే ఎవరితో ఎంత వరకు ఉండాలో.. అంతే ఉంటే.. ఎలాంటి సమస్యలు రావు. మిమ్మల్ని మీరు నమ్ముకుని.. ఫెయిల్ అయితే.. మళ్లీ ప్రయత్నం చేయాలనే ఆశ ఉంటుంది. అదే ఇతరులను నమ్మి మోసపోతే.. ఇక అందరూ ఇంతేననుకుని.. మీ ప్రయత్నం ఆగిపోతుంది.
అనేకమంది లైఫ్ లోకి వస్తుంటారు.. పోతుంటారు. అయితే ఎంత వరకూ నమ్మాలో అనే క్యాలిక్యూలేషన్.. మీకు ముందే ఉండాలి. నమ్మి మోసపోయాననే గిల్ట్ ఫీల్.. ఇక ఏ పనులూ చేయకుండానే ఆపేస్తుంది. స్నేహితుడు కావొచ్చు, ప్రేమించిన వారు కావొచ్చు.. ఎవరైనా.. వారికి ఇబ్బంది కలుగుతుందనకుంటే పక్కకు తప్పుకొంటారు. అందులో నీ తప్పేం లేదు. వారి తప్పేం లేదు. పరిస్థితులు అలా మార్చేశాయి. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నా.. కూడా అంతేనేమో అనుకుని ముందుకు సాగిపోవాలి అంతే.
అందుకే పెద్దలు మీ నీడను కూడా నమ్మెుద్దు అని చెబుతారు. కొన్ని సందర్భాల్లో నీడే మనల్ని భయపెడుతుంది. అలాంటిది అవతలి వారిని పూర్తిగా నమ్మేసి.. మీమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం అంత చెత్త పని ఇంకొకటి లేదు. మీ మీద నమ్మకం ఉంటే మెుదట మిమ్మల్ని మీరు జయిస్తారు. మిమ్మల్ని మీరు జయిస్తే.. ఏదైనా సాధించొచ్చు.. అదే లాజిక్కు. ఎంత హర్డ్ వర్క్ చేసినా.. ప్రతి విషయంలో మీ మీద మీకు పూర్తిగా నమ్మకం ఉండాలి. లేదంటే.. అవతలి వారి మీద ఆధారపడతారు. అదే మీరు కష్టాల్లోకి వెళ్లేందుకు మెుదటి మెట్టు.
నువ్వు ఓడిపోతే.. అందరూ నిన్ను ఒక్కడిని మాత్రమే చేస్తారు..
అదే నువ్ గెలిస్తే.. నీ వెనక మేం ఉన్నాం అంటారు..
నువ్ పడిపోతున్నప్పుడు పట్టుకోని వాడు.. నీ గెలుపు తర్వాత నీ పక్కన నిలబడితే ఏం ప్రయోజనం..
మనిషిలో చాలా రకాల ఆలోచనలు ఉంటాయ్.. అవి సమయాన్ని బట్టి మారుతాయ్.
అందుకే ఈ లోకంలో నిన్ను నువ్వు తప్ప ఎవ్వరినీ నమ్మెుద్దు.. చివరకు నీ నీడతో సహా..
ఎందుకంటే.. నీ నీడే వెలుగును బట్టి మారుతుంది..
సంబంధిత కథనం
టాపిక్