SBI కస్టమర్లు జాగ్రత్త.. ఇలాంటి ఎస్‌ఎంస్‌లు వస్తే అసలు స్పందించవద్దు!
డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి బ్యాంక్ ఖాతాలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి బ్యాంక్ ఖాతాలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా పేరొందిన ఎస్‌బీఐని టార్గెట్ చేశారు. SBI Yono పేరుతో MS ఫిషింగ్ స్కామ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. మీ పాన్‌ను అప్‌డేట్ చేయకపోతే, SBI YONO ఖాతా మూసివేయబడుతుంది అని SMS పంపించి.. ఆ లింక్ ఖాతాదారులు ఒపెన్ చేయగానే బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ళు చేరి మోసాలకు పాల్పడుతున్నారు. లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా SBI పేజీని పోలి ఉండే పేజీ తెరవబడుతుంది. ఈ పేజీలో వ్యక్తిగత సమాచారాన్న ఇవ్వాల్పిందిగా కస్టమర్‌లు కోరబడుతారు. వినియోగదారులు తమ సమాచారాన్ని నమోదు చేసిన వెంటనే, అది నేరుగా హ్యాకర్లకు వెళుతుంది. ఆ సమాచరాన్ని హ్యాకర్లు ఉపయోగించి ఖాతా నుండి మొత్తం డబ్బును దొచేస్తారు. కాబట్టి కొత్త ఫిషింగ్ రైడ్. ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్, కాల్స్ లేదా ఎంబెడెడ్ లింక్‌లకు స్పందించవద్దని ఎస్‌బిఐ కస్టమర్లను బ్యాంక్ హెచ్చరిస్తోంది.
ఎవరైనా మీ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ సమాచారాన్ని అడిగితే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వవద్దని సూచిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం కోసం అలాంటి కాల్ లేదా SMS వస్తే, మీరు report.phishing@sbi.co.inలో ఫిర్యాదును చేయవచ్చని.. లేదా బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ని కూడా సంప్రదించవచ్చని తెలిపారు
సంబంధిత కథనం
టాపిక్