తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కావాలా? అయితే ఈ టీవీ లపై ఓ లుక్కేయండి-save upto rs 23000 on these five 50 inch smart tv includes motorola oneplus kodak and more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కావాలా? అయితే ఈ టీవీ లపై ఓ లుక్కేయండి

తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కావాలా? అయితే ఈ టీవీ లపై ఓ లుక్కేయండి

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 05:24 PM IST

స్మార్ట్ టీవీలు వినోదాన్ని రెట్టింపు చేస్తాయి. అత్యాధునికి టెక్నాలజీ టచ్‌తో ఈతరం స్మార్ట్ టీవీలు రూపుదిద్దుకుంటున్నాయి. వినోదాన్ని డిఫరెంట్ ఛానలింగ్ ద్వారా ఎంజాయ్ చేసే అవకాశాన్ని కలిపిస్తున్నాయి. శాటిలైట్ చానెల్స్‌తో పాటు యూట్యూబ్‌, అనేక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్‌ల నుంచి వినోదాన్ని వీక్షించ‌వ‌చ్చు.

Smart TV
Smart TV

పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ టీవీ కొనాలో అర్థం కావడం లేదా? అయితే ఇప్పుడు 50 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో కూడిన కొన్ని టాప్ స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ టీవీలపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. Motorola, Vu, Thomsonతో పాటు OnePlus వంటి బ్రాండ్‌లపై మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ టీవీలపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంకింగ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌తో తక్కువ ధరలో టీవీలను పొందే అవకాశం లభిస్తోంది.

1. MOTOROLA Revou

డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ (50UHDADMRS7P) అల్ట్రా HD (4K) గల ఈ LED స్మార్ట్ Android TV అసలు ధర రూ. 48,999 ఉండగా.. 38% తగ్గింపుతో కేవలం 29,999కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. డిస్కౌంట్స్ ఆఫర్స్ ద్వారా మొత్తం రూ. 13,000 వరకు ఆదాను సొందవచ్చు. టీవీలపై రూ. 8000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కాకుండా ఈ టీవీపై కేవలం రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కాకుండా, TVపై SBI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా రూ. 2000 వరకు (రూ. 5000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై) అంటే 10% తగ్గింపుతో సహా అనేక బ్యాంకింగ్ ఆఫర్‌లు, ఫ్రీబీలను అందిస్తోంది. అసలు ధరతో పోల్చినట్లయితే, ఈ టీవీలోరూ. 23,000 ( 13,000 + 8000 + 2000) వరకు ఆదా చేసుకోవచ్చు.

2. vu premium tv

ఈ అల్ట్రా HD (4K) LED స్మార్ట్ Android TV (50PM) ధర రూ. 45,000 ఉండగా.. 33% తగ్గింపుతో కేవలం రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా ఈ టీవీపై రూ. 7,000 వరకు ఆదా చేసుకోవచ్చు. రూ. 11,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్‌ ద్వారా ఈ టీవీని కేవలం రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు.

ఈ TV లపై SBI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా రూ. 2000 వరకు (రూ. 5000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై) 10% తగ్గింపుతో సహా అనేక బ్యాంకింగ్ ఆఫర్‌లు, ఫ్రీబీలను లభిస్తున్నాయి. ఈ టీవీలపై మెుత్తంగా రూ. 20,000 ( 7,000 + 11,000 + 2000) వరకు ఆదా చేసుకోవచ్చు.

3. Mi 4X

ఈ 125.7 సెం.మీ (50 అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 41,999 ఉండగా.. 28% తగ్గింపుతో కేవలం రూ. 29,999కే లభిస్తోంది. వివిధ ఆపర్స్ ద్వారా రూ. 6,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీలపై రూ .11,600 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా ఈ టీవీని కేవలం రూ. 18,399కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కాకుండా, HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపుతో సహా అనేక బ్యాంకింగ్ ఆఫర్‌లు, ఫ్రీబీలతో లభిస్తున్నాయి . అన్ని ఆఫర్స్ ద్వారా రూ. 20,600 (రూ. 6,000 + రూ. 11,600 + రూ. 3000) వరకు ఆదా చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్