Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి
Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో టై దాక్కుని ఉంది. అదెక్కడుందో కనిపెట్టి చెబితే మీరు చాలా తెలివైన వారని అర్థం.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు వందల ఏళ్లుగా ప్రజలను అలరిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన ఆప్టికల్ఇల్యూషన్ ఇచ్చాము. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మెదడుకు ఆలోచనా శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇలా పజిల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడి ఆప్టికల్ ఇల్యూషన్లో మెడకు కట్టుకునే టై బొమ్మ ఉంది. అదెక్కడుందో కనిపెట్టి చెప్పండి.
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో పిల్లలు, పెద్దలు పార్కులో ఆడుకుంటూ ఉన్నారు. చెట్లు, బెంచీలు, మొక్కలు, పువ్వులు ఎన్నో ఉన్నాయి. ఇన్ని వస్తువుల మధ్య ఓ చోట టై ఉంది. దాన్ని మీరు కనిపెట్టారంటే మీలో డిటెక్టివ్ లక్షణాలు ఉన్నట్టే లెక్క. ప్రయత్నించండి.
ఇదిగో జవాబు
ఈ చిత్రంలో టై ఎక్కడుంతో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కనిపెట్ట లేకపోయిన వారి కోసం మేము ఇక్కడ జవాబు ఇచ్చాం. చిత్రంలో ఒక మూల కొబ్బరి చెట్టు ఉన్నాయి. అందులో మొదటి కొబ్బరి చెట్టు ఆకారాన్ని చూడండి. అదే టై.
ఆప్టికల్ ఇల్యూషన్లు పిల్లల్లోని కాగ్నిటివ్, సైకలాజికల్ సామర్ధ్యాలను పెంచుతుంది. మెదడు విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, గ్రహించే విధానాన్ని పెంచేస్తుంది. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే శక్తి పిల్లలకు వస్తుంది. వారి తెలివితేటలు కూడా పెరుగుతాయి. మన మెదడు పనితీరును ఆప్టికల్ ఇల్యూషన్లు పెంచుతాయి.
టాపిక్