OnePlus 10T: వన్ ప్లస్ నుంచి సూపర్ ఫోన్ వచ్చేస్తుందోచ్.. ఫోన్ ధరెంతో తెలుసా!-oneplus 10t 5g launch next week specifications leaked ahead of official launch ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus 10t: వన్ ప్లస్ నుంచి సూపర్ ఫోన్ వచ్చేస్తుందోచ్.. ఫోన్ ధరెంతో తెలుసా!

OnePlus 10T: వన్ ప్లస్ నుంచి సూపర్ ఫోన్ వచ్చేస్తుందోచ్.. ఫోన్ ధరెంతో తెలుసా!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 03:47 PM IST

OnePlus తన న్యూ బ్రాండ్ OnePlus 10Tని ఆగస్టు 3న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ స్పెసిఫికేషన్స్, ధరను చూస్తే..

OnePlus 10T ht times
OnePlus 10T ht times

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మెుబైల్ దిగ్గజం OnePlus ఆగస్టు 3న తన న్యూ మోడల్ OnePlus 10Tని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్దమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన విశేషాలను వన్‌ప్లస్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో వెల్లడించింది. “అద్భుతాలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. ఆగస్టులో OnePlus 10T ఆవిష్కరణను చూసే అవకాశాన్ని కోల్పోకండి" అంటూ ట్వీట్ చేసింది. స్మార్ట్‌ఫోన్ లాంచ్ ప్రీమియర్ వేడుక బెంగళూరులో నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫోన్ స్పెసిఫికేషన్స్

OnePlus 10T ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల కానుంది. 8 GB + 128 GBతో పాటు 12 GB + 256 GB వంటి రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది . ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌ను అందించారు. ఇది ఆండ్రాయిడ్ 12లో ఫోన్ రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 13లో పనిచేసే OxygenOS 13కి అప్‌డేట్ చేసే అవకాశం ఉంటుంది.

ట్రిపుల్ రియర్ కెమెరా

OnePlus 10T ట్రిపుల్ రియర్ కెమెరాతో రూపొందించారు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో చాట్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. OnePlus 10Tలో అలర్ట్ స్లైడర్, హస్ల్‌బ్లాడ్ టర్న్ కెమెరాలు ఉండవని OnePlus ఇప్పటికే ధృవీకరించింది.

4800 mAh బ్యాటరీ

OnePlus 10T 4800 mAh బ్యాటరీ ప్యాక్‌తో 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120 HZ రిఫ్రెష్ రేట్‌తో HDR10 సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇప్పటివరకు OnePlus మెుబైల్‌లో ఉన్న స్లైడర్‌ను ఈ మెుబైల్‌లో అందించలేదు. OnePlus 10T పాపులార్ అలర్ట్ స్లైడర్‌ను పొందకపోవడానికి కారణం స్లిమ్ ప్రొఫైల్‌. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.49,999గా ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్