NHAI Recruitment 2022: NHAIలో మేనేజర్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!
NHAI Recruitment 2022: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో మేనేజర్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 6, 2022.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మేనేజర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు NHAI అధికారిక సైట్ ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మెుత్తంగా 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 6, 2022. ఇతర డాక్యుమెంట్‌లతో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 20, 2022. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు
జనరల్ మేనేజర్: 2 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 4 పోస్టులు
మేనేజర్: 1 పోస్ట్
అర్హత: పైన పేర్కొన్న పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన వివరాలు కింది నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
దరఖాస్తులను పంపాల్సిన చిరునామ
జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.
DGM (HR & Admn)-IA
National Highways Authority of India
Plot No.G5-&6, Sector-10,
Dwarka, New Delhi-110075
మేనేజర్ పోస్టుల దరఖాస్తులను కింది చిరునామకు పంపండి
DGM (HR & Admn)-IB
National Highways Authority of India
Plot No.G5-&6,
Sector-10, Dwarka, New Delhi-110075.
సంబంధిత కథనం