Monday Motivation | లైఫ్​ అంటే కలర్​ఫుల్​గా.. బ్యూటీఫుల్​గా ఉండాలి..-monday motivational quote on life is painting a picture not doing a sum ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation | లైఫ్​ అంటే కలర్​ఫుల్​గా.. బ్యూటీఫుల్​గా ఉండాలి..

Monday Motivation | లైఫ్​ అంటే కలర్​ఫుల్​గా.. బ్యూటీఫుల్​గా ఉండాలి..

HT Telugu Desk HT Telugu
May 30, 2022 06:30 AM IST

జీవితమనేది ఎప్పుడూ యాంత్రికంగా ఉండకూడదు. చాలా జ్ఞాపకాలు ఉండాలి. అవి మంచివైనా.. చెడువైనా కావొచ్చు. కానీ ఏదొకటి నిరంతరం జరుగుతుంటేనే.. దానికి అందం. లైఫ్ అంటే సీరియస్​గా మాత్రమే కాదు.. కాస్త సరదాలు, ప్రేమలు, బాధలు, అనుబంధాలు.. వంటి ఎమోషన్స్​ అన్ని మిక్స్​ అయితేనే దాన్ని పూర్తిగా అనుభవించినట్లు.

బ్యూటీఫుల్ లైఫ్
బ్యూటీఫుల్ లైఫ్

Monday Motivation | మనిషన్నాకా కాసింత కళాపోషణ ఉండాలి అని ఓ సినిమాలో రావుగోపాలరావు చెప్తారు. అలాగే లైఫ్ అన్నాక దానిలో కొన్నైనా రంగులు ఉండాలి. ఏదో లెక్కలు చేసినట్లు సీరియస్​గా కాకుండా.. పెయింగ్​ వేస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్​గా, హ్యాపీగా.. ఆసక్తిగా వేస్తామో అలా ఉండాలి. అంతే కానీ ఏదో ఉన్నామంటే ఉన్నాం. తిన్నామంటే తిన్నాం. చేశామంటే చేశాం అన్నట్లు ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది. లైఫ్​ మనకు ఆనందాన్ని ఇచ్చేలా.. లోతైనా అనుభవాలు ఇచ్చేలా ఉండాలి.

ఏదైనా పెయింటింగ్ వేస్తున్నప్పుడు మన ఎఫెర్ట్స్ అన్ని దానిలోనే పెడతాం. దానిని ఎంత అందంగా మలచగలం అని ఆలోచిస్తాం. ఇంకేమి రంగులు పూస్తే.. బాగుంటుందని మన క్రియేటివిటినంతా దానిమీదే చూపిస్తాం. దానికోసం టైం ఇస్తాం. చాలా శ్రద్ధగా దాని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. దీనిని జీవితానికి అన్వయించుకోవాలి. లైఫ్ కలర్​ఫుల్​గా ఉండడానికి ఎలాంటి పనులు చేయాలి. ఎలా కష్టపడాలి. ఏమి చేస్తే మనం బాగుంటాం అనే విషయాలపై శ్రద్ధ వహించాలి. సరిగ్గా చెప్పాలి అంటే.. మీరు మీ జీవితంతో ఏమి చేయాలని ఎంచుకున్నా.. దానికి మన సమయం, శక్తి, కృషిని అందించాలి. ఇలా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ద్వారా మనలో క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుంది. బోరింగ్ డేస్​ నుంచి ఆనందంగా గడిపే రోజులకు చేరుకోవచ్చు.

మొదట్లో నిరాశ, నిస్సహాయత ఉండొచ్చు కానీ.. తదుపరి రోజుల్లో ఆ ఆనందాన్ని మీరు కచ్చితంగా పొందుతారు. మీ జీవితాన్ని ఆస్వాదించడం మీరు కచ్చితంగా నేర్చుకుంటారు. దానిని అస్సలు మిస్ చేసుకోకూడదు. జీవితాన్ని లోతుగా అనుభవించడానికి మీరు చేయాలనే విషయాలను గుర్తించాలి. వాటిని చేసినప్పుడు మీకు కలిగే ఆనందం మాటల్లో కూడా చెప్పలేము. ఉద్యోగ సమయంలో ఎంజాయ్ చేయలేకపోవచ్చు కానీ.. ఆఫీసు సమయం ముగిశాకైనా కాస్త జీవించండి.

మనమందరం జీవితాన్ని భిన్నమైన రీతిలో, వివిధ పాయింట్లలో అనుభవిస్తాము. కానీ అందరూ వారి వారి జీవితాల్లో మరింత లోతుగా, పూర్తిగా జీవించడానికి కొంత ప్రయత్నం చేయవచ్చు. పైగా అందరం దానికి అర్హూలం. మీ జీవితాన్ని మీకు వీలైనంత వరకు పూర్తిగా, సంపూర్ణంగా జీవించడమే ప్రధాన విషయం. రేపు ఉంటామో లేదో తెలియని ఈ జీవితంలో.. నేటిని సద్వినియోగం చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్