Masala Vada: మూడు పప్పులు కలిపి ఇలా మసాలా గారెలు చేయండి, బెస్ట్ స్నాక్స్ రెసిపీ ఇది-mix three pulses and make masala vada like this this is the best snacks recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Vada: మూడు పప్పులు కలిపి ఇలా మసాలా గారెలు చేయండి, బెస్ట్ స్నాక్స్ రెసిపీ ఇది

Masala Vada: మూడు పప్పులు కలిపి ఇలా మసాలా గారెలు చేయండి, బెస్ట్ స్నాక్స్ రెసిపీ ఇది

Haritha Chappa HT Telugu
Dec 22, 2023 04:00 PM IST

Masala Vada: ఎప్పుడూ శనగపప్పుతోనే మసాలా గారెలు తిని బోర్ కొడితే, ఒకసారి మూడు రకాల పప్పులను కలిపి మసాలా గారెలు వండి చూడండి.

మూడు పప్పులతో చేసే మసాలా వడ
మూడు పప్పులతో చేసే మసాలా వడ (smithakalluraya)

మసాలా వడ రెసిపీ

Masala Vada: సాయంత్రం పూట వేడివేడిగా మసాలా వడ తింటే ఆ మజానే వేరు. ఎప్పుడూ శనగపప్పుతోనే మసాలా వడలు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మూడు రకాల పప్పులను కలిపి మసాలా వడలు చేసుకుని తిని చూడండి. రుచి అదిరిపోతుంది. దీనిలో కొత్తిమీర, పచ్చిమిర్చి వంటివి కలిపితే వాటి రుచి ఇంకా బాగుంటుంది. వీటిని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

మూడు పప్పులతో మసాలా వడ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - అరకప్పు

మినప్పప్పు - అరకప్పు

కందిపప్పు - అరకప్పు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - ఆరు రెబ్బలు

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - మూడు

కొత్తిమీర - ఒక కట్ట

కరివేపాకులు - గుప్పెడు

ఉల్లిపాయ - ఒకటి

పుదీనా - ఒక కట్ట

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

మూడు పప్పుల మసాలా వడ రెసిపీ ఇలా

1. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పులను విడివిడిగా బాగా కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.

2. అవి బాగా నానాక మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయాలి.

3. అందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా తీసి తీసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు.

4. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి తగినంత ఉప్పు కలుపుకోవాలి.

5. ఉల్లి తరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలవనివ్వాలి. చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్‌ని వేయాలి.

7. ఆయిల్ వేడెక్కాక ఈ పప్పులోని చిన్న ముద్దను తీసి వడల్లా ఒత్తుకొని వాటిలో వేసుకోవాలి.

8. ఇవి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటాయి.

9. సాస్, పుదీనా చట్నీలతో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఇవి నచ్చడం ఖాయం.

WhatsApp channel

టాపిక్