asthma: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా?-milk consumption and mucus production in children with asthma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Asthma: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా?

asthma: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా?

HT Telugu Desk HT Telugu
May 28, 2022 11:49 PM IST

ఛాతీలో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పెరిగిన శ్లేష్మం న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

<p>asthama</p>
asthama

సాధరణంగా అన్ని సీజన్‌లలో ఆస్తమా బాధితులు చాలా ఇబ్బంది పడుతుంటారు. వ్యాధి ముదిరే కొద్దీ రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వేసవిలో అయితే ఆస్తమా రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఛాతీ బిగుతు, దగ్గు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువగా ఉంటంది. రోగులలో శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల శ్వాసనాళాల్లో వాపు వస్తుంది.

ఛాతీలో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పెరిగిన శ్లేష్మం న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. ఇప్పటికే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో కూడా బాధపడుతున్నట్లయితే, శ్లేష్మం సమస్యలను కలిగించని డైట్‌ను ఫాలో అవ్వాలి.

పాలు ఆస్తమా రోగుల సమస్యలను పెంచుతాయి: పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అయితే పాలు ఆస్తమా రోగులకు సమస్యను పెంచుతుంది. పాలు తాగడం ద్వారా, శ్వాసకోశ వ్యాధులు దగ్గు, గొంతు నొప్పి, శ్లేష్మం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తారు. ఆస్తమా రోగులు పాలకు దూరంగా ఉండాలి.

తేనె తినండి: గొంతులో శ్లేష్మం సమస్య ఉంటే, తేనెను తినండి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తేనెను తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఆస్తమా రోగులకు తేనె మరియు నిమ్మకాయ వినియోగం ఏ ఔషధం కంటే తక్కువ కాదు.

పచ్చి పసుపు తినండి: ఆస్తమా రోగులు శ్లేష్మం నిరోధించాలనుకుంటే, పచ్చి పసుపు తినండి. పసుపు రసాన్ని కొన్ని చుక్కలు తీసుకొని మీ గొంతులో వేసుకోండి, గొంతులో శ్లేష్మం ఏర్పడదు. కావాలంటే పసుపు రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించుకోవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది, ఇది శ్లేష్మాన్ని తొలగిస్తుంది. పసుపును తీసుకుంటే దగ్గు, జలుబు కూడా దూరమవుతాయి.

వెచ్చని వాటిని తీసుకోండి: ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం తొలగించడానికి, వేడి వాటర్ లాంటివి తీసుకోండి. వేడి నీరు, చికెన్ సూప్, వేడి ఆపిల్ రసం, గ్రీన్ టీ తీసుకోవచ్చు. వేడి ద్రవ ఆహారం ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించడంతోపాటు గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వెచ్చని ద్రవాలు ఛాతీ, ముక్కులో శ్లేష్మం తొలిగిపొవడానికి సహాయపడతాయి.

Whats_app_banner