Cannes 2023: కేన్స్‌లో మెరిసిన మన చందమామలు.. మానుషి, ఈశా అందాలు..
Cannes 2023: అదిరిపోయే తెలుపు రంగు గౌనుల్లో మానుషి చిల్లర్, ఈశా 76 వ కేన్స్ ఉత్సవాల్లో రెడ్ కార్పెట్ మీద మెరిసిపోయారు.
Cannes 2023: కేన్స్ చలన చిత్ర వేడుకలు మార్చి 16 న మొదలయ్యాయి. మే 27 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగానికి చెందిన నటులు, మోడళ్లు, డిజైనర్లు ఈ వేడుకకు హాజరవుతున్నారు. మానుషి, ఈశా, సారా అలీఖాన్ రెడ్ కార్పెట్ మీద మెరిసారు. సారా సాంప్రదాయ లెహెంగాలో అలరిస్తే మానుషి, ఈశా తెలుపు రంగుల్లో హొయలుపోయారు.
మానుషి తెలుపు రంగు ట్యూల్ గౌనును ఈ సంవత్సరం కేన్స్ కోసం ఎంచుకున్నారు. వాల్కర్స్ అండ్ కో బ్రాండ్ ప్రతినిధిగా ఆమె ఈ వేడుకలకు హాజరయ్యారు. మానుషి హాఫ్ షోల్డర్ తెలుపు రంగు గౌనుకు, కార్సెట్ డిజైనింగ్ తరహాలో ప్లంజింగ్ నెక్ ఉన్న గౌన్ ఎంచుకున్నారు. దీనికి వెనకాల ఫ్రిల్స్ ఉన్న పొడవాటి టెయిల్ ఉంది. మధ్య పాపిటతో వేవీ హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్ లుక్ తో ప్రత్యేకంగా నిలిచారు.
ఈశా కూడా తెలుపు రంగు శాటిన్ గౌను ఎంచుకుంది. కాస్త వెరైటీ డిజైన్ తో ఉన్న కాలర్ నెక్, ప్లంజింగ్ నెక్ మీద డిజైనింగ్ తో ఉన్న నెట్. నెట్ మీద కూడా పువ్వులతో చేసిన అలంకరణ ప్రత్యేకంగా ఉంది. నడుము దగ్గర చిన్న కుచ్చుల డిజైనింగ్, ఒక వైపు పొడవాటి స్లిట్ తో గౌను డిజైనింగ్ పూర్తయింది. సిగకట్టుతో, న్యూడ్ ఐషాడో డిజైన్, నలుపు రంగు ఐ లైనర్, కనురెప్పలకు మస్కారా, మెరూన్ లిప్ స్టిక్ తో ఈశా తన లుక్ పూర్తి చేశారు.
సంబంధిత కథనం