Hypersomnia Issues : రాత్రి మంచిగా నిద్రపోయినా.. పగలు నిద్ర ఇబ్బంది పెడుతుందా?
Hypersomnia Issues : రాత్రుళ్లు ఎంత మంచిగా పడుకున్న కొందరికి పగలు కూడా నిద్రమత్తు వదలదు. రాత్రి నిద్రపోలేదంటే.. పగలు నిద్రరావడంలో తప్పులేదు. కానీ రాత్రి మంచిగా పడుకున్నా.. పగలు నిద్రవస్తుందంటే అర్థం మీరు హైపర్సోమ్నియాతో ఇబ్బంది పడుతున్నారని అర్థం. ఇంతకీ హైపర్సోమ్నియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి?
Hypersomnia Issues : హైపర్సోమ్నియా సాధారణంగా మగవారి కంటే ఆడవారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది జనాభాలో 5% మందిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఇది కౌమారదశలో లేదా 17 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యువకులలో ఎక్కువగా నిర్ధారణ అవుతుంది.
హైపర్సోమ్నియా అంటే ఏమిటి?
హైపర్సోమ్నియా అంటే.. అధిక పగటి నిద్ర లేదా నిద్రలేమి ఫిర్యాదు. హైపర్సోమ్నియా అనేది రోగికి తగినంత మొత్తంలో రాత్రి నిద్ర ఉన్నప్పటికీ.. పగటిపూట కూడా నిద్రసరిపోనట్లు.. నిద్రమత్తులో ఉండండం. అయితే ఈ రుగ్మత మీ పని, గృహ, సామాజిక జీవితాన్ని సవాలు చేస్తుంది.
మానసిక నిపుణుడు లేదా కౌన్సెలర్‌తో మాట్లాడటం ద్వారా హైపర్సోమ్నియా వల్ల కలిగే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది. ఎందుకంటే.. హైపర్సోమ్నియాతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా సోమరితనంతో ఉంటారు. వారు అసమర్థలని, దేనికి పనికిరారని సొసైటీ ఫీల్ అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిపై వారికి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా హైపర్సోమ్నియా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైపర్సోమ్నియా లక్షణాలు
* ఉదయం నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది.
* పగటి పూట నిద్రపోతే లేవాలని అనింపించకపోవడం
* తరచూ పగలు నిద్రపోవడం
* ఆందోళన, చిరాకు
* శక్తి లేకపోవడం
* ఏకాగ్రత తగ్గడం
* నెమ్మదిగా మాట్లాడటం
* జ్ఞాపకశక్తి సమస్యలు
* తలనొప్పి
* ఆకలి లేకపోవడం
హైపర్సోమ్నియాను ఎదుర్కోవటానికి మార్గాలు
* ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోండి.
* నిద్రపోయే ముందు కెఫిన్ కలిగిన ఉత్పత్తులను (కాఫీ, కోలా, టీ, చాక్లెట్ వంటివి) నివారించండి.
* నిద్రవేళకు ముందు మద్యం మానేయండి.
* పడుకునే ముందు పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి.
* ఆహారం, నిర్దిష్ట మందుల విషయంలో ఏమి రాత్రి నివారించాలో మీ డాక్టర్ని అడగి తెలుసుకోండి.
సంబంధిత కథనం