Urinary tract infection : ఇంటి చిట్కాలతో UTI సమస్యలను దూరం చేసుకోండిలా..-home remedies for urinary tract infection without antibiotics ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Urinary Tract Infection : ఇంటి చిట్కాలతో Uti సమస్యలను దూరం చేసుకోండిలా..

Urinary tract infection : ఇంటి చిట్కాలతో UTI సమస్యలను దూరం చేసుకోండిలా..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 12, 2022 11:52 AM IST

Urinary tract infection : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే అత్యంత సాధారణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. దాదాపు 50-60% మంది మహిళలు తమ జీవితకాలంలో UTIని అనుభవిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోవడం అవసరం. మీ సమస్య పెద్దది కాకపోతే.. ఇంట్లోనే కొన్ని పద్ధతులను అనుసరించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

Urinary tract infection : UTI అనేది ప్రాణాంతక పరిస్థితి కానప్పటికీ.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అనేక రకాల అసౌకర్య లక్షణాలను కలిగిస్తుంది. దీని లక్షణాలు చాలా ఇబ్బంది పెడతాయి. మూత్రవిసర్జన చేయాలనే బలమైన కోరిక, మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట, బలమైన వాసనతో కూడిన మూత్రం, కడుపు నొప్పి వంటివి దీని ప్రధాన లక్షణాలు. వైద్యులు ఈ సమస్యకు చికిత్సలో భాగంగా.. యాంటీబయాటిక్స్ సూచిస్తారు. యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే మందులు. ఈ కోర్సు ఐదు రోజులు వాడాల్సి ఉంటుంది. పురుషులకు అయితే కోర్సు మరింత ఎక్కువ కాలం సూచిస్తారు.

తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి యాంటీబయాటిక్స్ ఉత్తమ చికిత్స ఎంపిక. అయితే మీ లక్షణాలు స్వల్పంగా ఉంటే.. మీరు వైద్యుడిని సంప్రదించకుండానే.. యాంటీబయాటిక్స్ లేకుండానే ఇంట్లో కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ.. ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. యాంటీబయాటిక్స్​తో ఇబ్బందులు ఉన్నవారు కూడా వీటిని ఫాలో అవ్వొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు తాగండి..

UTIతో సహా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు కీలక పరిష్కారం. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల UTI సమస్యను తగ్గించుకోవచ్చు. నీరు తాగడం వల్ల మూత్రం పలుచన అవుతుంది. తద్వారా మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేసేలా సహాయం చేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించే అన్ని బ్యాక్టీరియాను ఇది శరీరం నుంచి బయటకు పంపుతుంది.

క్రాన్బెర్రీస్

మీకు అందుబాటులో ఉంటే క్రాన్బెర్రీస్​ని UTIకి చికిత్సగా ఉపయోగించవచ్చు. దీనిగురించి ఎలాంటి నిశ్చయాత్మక పరిశోధన లేనప్పటికీ.. కొన్ని అధ్యయనాలు తియ్యని క్రాన్బెర్రీ జ్యూస్, క్రాన్బెర్రీ సప్లిమెంట్స్ లేదా ఎండిన క్రాన్బెర్రీస్ UTIల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వెల్లడించాయి.

ఎందుకంటే క్రాన్‌బెర్రీస్‌లో ప్రోయాంతోసైనిడిన్స్ (PACలు) ఉంటాయి. ఇవి మీ మూత్ర నాళాల లైనింగ్‌కు బ్యాక్టీరియా అంటుకోకుండా చేస్తాయి.

ప్రోబయోటిక్స్..

ప్రోబయోటిక్స్ అనేది జీర్ణక్రియ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే సూక్ష్మజీవులు. ప్రోబయోటిక్స్ E. coli వంటి "చెడు" బాక్టీరియాను తొలగించి.. 'మంచి' బ్యాక్టీరియాతో భర్తీ చేయడంలో సహాయపడతాయి. అందుకే అవి UTIలకు చికిత్స చేయడంలో, నిరోధించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

విటమిన్ సి..

విటమిన్ సి దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించడం, రక్తపోటు స్థాయిలను తగ్గించడం, శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.

UTI లకు సంబంధించినంతవరకు.. మీరు విటమిన్ సి-తీసుకోవడం పెంచడం వలన మీ మూత్రం ఆమ్లతను పెంచి.. UTIకి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండు, కివి, రెడ్ బెల్ పెప్పర్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

అస్సలు ఆపుకోకండి..

UTIతో బాధపడుతున్నప్పుడు, చికిత్స తీసుకుంటున్నప్పుడు మీరు ఓ విషయం కచ్చితంగా గుర్తించుకోవాలి. అదేంటంటే మీరు మీ మూత్ర విసర్జనను ఎప్పుడూ నియంత్రించుకోకూడదు. ఎంత అసౌకర్యంగా ఉన్నా.. లేదా బ్లాడర్​ ఫుల్​ అయినప్పుడు మూత్ర విసర్జన చేయండి. మీరు వెళ్లకుండా అలానే ఆపేసుకుంటే.. అది బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్