Heart Attack Symptoms : ఈ లక్షణాలు గుండెపోటుకు సంకేతాలు.. ఇగ్నోర్ చేయకండి..
Heart Attack Symptoms : భాజాపా నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గుండె వైఫల్యానికి కొన్ని ప్రారంభ సంకేతాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని మీరు గుర్తిస్తే విస్మరించకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Heart Attack Symptoms : సిద్దార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్ , సింగర్ కెకె, బ్రహ్మ స్వరూప్ మిశ్రా , తాజాగా సోనాలి ఫోగట్.. ఇలా చాలా మంది ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించారు. వారు స్పూర్తిదాయకమైన ఫిట్‌నెస్ రొటీన్‌లు ఫాలో అవుతున్నప్పటికీ.. గుండె వైఫల్యానికి గురయ్యారు. గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు లేదా గుండె సామర్థ్యం తగ్గిపోయినప్పుడు గుండె పోటు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే గుండెపోటు కన్నా ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని వాటిని అస్సలు విస్మరించవద్దు అంటున్నారు.
మీకు గుండెపోటు వస్తుందని, దాని గురించి కూడా తెలుసుకోలేమని మీకు తెలుసా? అవును అది చాలా సైలంట్‌గా వచ్చే అవకాశముంది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్ హార్ట్ ఎటాక్ రావచ్చు. మరికొందరికి లక్షణాలు అస్సలు తెలియదు. కాబట్టి వాటిని సీరియస్‌గా తీసుకోరు. మీకు ఫ్లూ లేదా ఛాతీలో కండరాల నొప్పి ఉన్నట్లు అనిపిస్తుందా? దవడ నొప్పి, అలసట, అజీర్ణం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చలిలో చెమటలు, తేలికపాటి తలనొప్పి, వికారం, వాంతులు, గుండెల్లో మంట ఇవన్నీ గుండెపోటు లక్షణాలే అంటున్నారు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిపీన్‌చంద్ర.
* శరీర శక్తి అవసరాలను తీర్చడానికి గుండె ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు.. అలసిపోయినట్లు లేదా అలసటగా అనిపించవచ్చు. అందువల్ల వారు తమ రోజువారీ పనులను సులభంగా చేయలేరు.
* అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజువారీ కార్యకలాపాలను సులభంగా చేయలేరు. తరచుగా అలసిపోతారు. ఏ పనిపై దృష్టి పెట్టలేరు.
* ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం వలన దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు.
* చీలమండ వాపు - దిగువ అంత్య భాగాల నుంచి ఉపయోగించిన రక్తాన్ని తిరిగి పైకి నెట్టడానికి గుండెకు అంతగా అవసరమైన పంపింగ్ శక్తి లేనప్పుడు.. చీలమండలు, కాళ్లు, తొడలు, పొత్తికడుపులో ఉన్న ద్రవాన్ని సేకరిస్తాయి. దీనివల్ల చాలా మంది బరువు పెరుగుతారు.
* శ్వాస ఆడకపోవడం - ఇది కూడా హార్ట్ ఫెయిల్యూర్ సాధారణ లక్షణమే. ఊపిరితిత్తులలో ఉండే ద్రవం, ఉపయోగించిన రక్తంలో కార్బన్ డయాక్సైడ్ తాజా ఆక్సిజన్‌గా మారడం కష్టతరం చేస్తుంది. ఊపిరితిత్తుల కింద నుంచి ద్రవం ఒకరి మొండెం పైకి ప్రయాణించడానికి అనుమతించే గురుత్వాకర్షణ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు.
* కొందరు జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఏమి చేయాలి అనేదానిపై క్లారిటీ లేక ఆలోచనలు ఎక్కువైపోతాయి.
* ఆకలి లేకపోవడం, వికారం కూడా ఓ లక్షణమే. గుండెలో సమస్య కారణంగా జీర్ణవ్యవస్థ తక్కువ రక్తాన్ని పొందుతుంది. ఇది జీర్ణక్రియలో సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పేలవమైన ఆకలి, వికారం వంటి సంకేతాలు కూడా ఉంటాయి.
* గుండె దడ కూడా ఓ లక్షణమే. ఇది మీ గుండె పరుగెత్తుతున్నట్లు లేదా ఎక్కువగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు గనుక మీరు గమనించినట్లైతే.. వెంటనే వైద్యుని సంప్రదించండి.