Mutton Brain Benefits : నెలకు రెండు సార్లు మటన్ బ్రెయిన్ తింటే ఏమవుతుంది?
Mutton Brain Benefits : మాంసాహారులందరూ మటన్ తినడానికి ఇష్టపడతారు. మటన్‌తో పాటు మేక తల, లివర్, బోటి, మటన్ బ్రెయిన్ వంటి వాటిని కూడా తింటారు. ఇవన్నీ కర్రీ చేశాక చాలా రుచికరంగా ఉంటాయి. పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి.
మటన్ బ్రెయిన్ చాలా మందికి ఇష్టం. ఫ్రై చేసుకుని తింటే ఆ టేస్టే వేరు. మటన్ బ్రెయిన్లో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది కొద్దిగా లోహపు రుచిని కలిగి ఉండటం వలన, బాగా మసాలా దినుసులు వేసి వండినప్పుడు రుచిగా అనిపిస్తుంది.
మేక మెదడులో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో సంతృప్త కొవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మటన్ బ్రెయిన్ తరచుగా తినకుడదు. నెలకు రెండుసార్లు తినవచ్చు. అది కూడా మితంగా తినాలి. కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. మేక మెదడు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
మటన్ బ్రెయిన్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మెదడు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మటన్ బ్రెయిన్లో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వల్ల కండరాల గాయాలు నయం, కండరాల పెరుగుదల, బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకం. నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుకు ఇది అవసరం. ఈ విటమిన్ నరాలలో రక్షణ కవచాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, అలసట, నరాల సంబంధిత సమస్యలు మొదలవుతాయి. మీరు మటన్ బ్రెయిన్ తింటే, మీకు తగినంత విటమిన్ B12 లభిస్తుంది.
మేక మెదడులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం. ఐరన్ రోగనిరోధక వ్యవస్థ పనితీరు, DNA సంశ్లేషణకు కూడా సహాయపడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
దీనిలో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. సెలీనియం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మద్దతు ఇస్తుంది. DNA ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మటన్ బ్రెయిన్‍లో జింక్ పుష్కలంగా ఉంటుంది. పురుషుల లైంగిక ఆరోగ్యానికి జింక్ ఒక ముఖ్యమైన పోషకం. ఈ పోషకం లోపిస్తే శుక్రకణాల ఉత్పత్తిలో లోపం ఏర్పడుతుంది. పురుషులు ఇది తింటే వారి లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.