GAIL Recruitment 2022: గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం!
GAIL Recruitment 2022: గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సీనియర్ ఇంజనీర్ / మేనేజర్ / సీనియర్ ఆఫీసర్‌తో ఇతర పోస్టులను భర్తీ చేయనుంది.
GAIL (ఇండియా) లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, సీనియర్ ఇంజనీర్ / మేనేజర్ / సీనియర్ ఆఫీసర్‌తో ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగ ప్రారంభంలోనే ఎక్కువ జీతం ఆశించేవారికి ఇది మంచి అవకాశం. ఈ రిక్రూట్‌మెంట్‌లో SC / ST / OBC (NCL) / PWBD అభ్యర్థుల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి ముందు, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి
పోస్టుల వివరాలు
మేనేజర్ – 2
మేనేజర్ (మార్కెటింగ్ – ఇంటర్నేషనల్ LNG & షిప్పింగ్) – 03
సీనియర్ ఇంజనీర్ (మెకానికల్) – 04
సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 02
సీనియర్ ఇంజనీర్ (కెమికల్) – 01
సీనియర్ ఇంజనీర్ (జెల్టెల్ TC/TM) – 03
సీనియర్ ఇంజనీర్ (బాయిలర్ ఆపరేషన్స్ ) )-03
సీనియర్ ఆఫీసర్ (F&S)-05
సీనియర్ ఇంజనీర్ (సివిల్)-01
సీనియర్ ఆఫీసర్ (C&P)-02
సీనియర్ ఆఫీసర్ (BIS)-03
సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్)-05
సీనియర్ ఆఫీసర్ (HR) -06
సీనియర్ ఆఫీసర్ (F&A)-03
సీనియర్ ఆఫీసర్ (CC)-02
ఆఫీసర్ (ల్యాబ్)-03 ఆఫీసర్ (OL)-02
సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-01
సీనియర్ ఇంజనీర్ (కెమికల్)-01
సీనియర్ ఇంజనీర్ ( మెకానికల్)-02
సీనియర్ ఇంజనీర్-02
సీనియర్ ఆఫీసర్ (HR)-02
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 15, 2022లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు
అన్ని పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
జీతం
ఎంపికైన అభ్యర్థులు రూ. 29,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం పొందుతారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
step 1- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gailonline.comని సందర్శించాలి.
step 2- దీని తర్వాత అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, కాంటక్ట్ వివరాలను నమోదు చేసుకోవాలి.
step 3- క్రెడిషియల్స్ ఉపయోగించి లాగిన్ చేయండి.
step 4- అడ్వర్టైజ్‌మెంట్ నంబర్‌ను ఎంచుకోండి, ఆపై మీరు దరఖాస్తు చేస్తున్న పోస్ట్‌ను ఎంచుకోండి.
step 5- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి (వ్యక్తిగత వివరాలు, అర్హత. అనుభవ వివరాలతో).
step 6- ఇప్పుడు దరఖాస్తు రుసుము చెల్లించండి.
step 7- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు, “ఫైనల్ ప్రివ్యూ”పై క్లిక్ చేసి, ఫారమ్ వివరాలను ఒకసారి చెక్ చేయండి.
step 8- అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి.
సంబంధిత కథనం