Cooking in Earthen Pots । కుండలో వండుకోండి, కొండంత ప్రయోజనం!-five ground to earth benefits of cooking in earthen pots check how clay cookers make difference ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cooking In Earthen Pots । కుండలో వండుకోండి, కొండంత ప్రయోజనం!

Cooking in Earthen Pots । కుండలో వండుకోండి, కొండంత ప్రయోజనం!

HT Telugu Desk HT Telugu
Jul 21, 2023 06:30 PM IST

Cooking in Earthen Pots: మట్టి పాత్రలో వండిన ఆహారం నాణ్యతతో, మంచి పోషక విలువలతో నిండి ఉంటుంది. మట్టి కుండలో వండితే కలిగే ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Cooking in Earthen Pots
Cooking in Earthen Pots (istock)

Cooking in Earthen Pots: పాతకాలంలో సాంప్రదాయ వంటలన్నింటినీ మట్టి కుండలలోనే వండేవారు. నిజాని మట్టి పాత్రలలో వండటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉండేవి. నేడు ప్రతీ ఇంట్లో మట్టి పాత్రల స్థానంలో ఖరీదైన ఫాన్సీ వంట పాత్రలు, నాన్ స్టిక్ పాత్రలు అంటూ వచ్చి చేరాయి. కానీ, మట్టి పాత్రలో వండిన ఆహారమే నాణ్యతతో, మంచి పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇలాంటి ఆహారమే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ రోజుల్లో ప్రజలకు మళ్లీ ఆరోగ్య స్పృహ పెరగడం ద్వారా నేడు మళ్లీ మట్టి పాత్రలలో వండుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. కుండ బిర్యానీ, కుండ చికెన్, కుండ చాయ్ అంటూ ప్రత్యేక రెసిపీలను పరిచయం చేస్తున్నారు. మట్టి పాత్రల్లో వండితే కలిగే ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

1. ఖనిజ లవణాలు కలిసిన ఆహారం

మట్టికుండల్లో వండితే, ఆహారంలో హానికరమైన లోహ సమ్మేళనాలకు బదులుగా శరీరానికి అవసరమయ్యే ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు చేరతాయి. ఇతర పాత్రల్లో వండినపుడు వేడికి హానికరమైన లోహాలు కరిగి ఆహారంలో కలుస్తాయి, పోషకాలు నశిస్తాయి. మట్టి కుండలో వండితే ఈ సమస్య ఉండదు.

2. అద్భుతమైన రుచి

మట్టి కుండలో వండిన ఆహారం చాలా భిన్నంగా, ఎంతో రుచికరంగా ఉంటుంది. కూరలు, రసాలు, సాస్‌లు, సూప్‌లు, మాంసం, బిర్యానీ వంటివి మట్టికుండల్లో వండుకోవచ్చు.

3. పోషక స్థాయిలు పెరుగుతాయి

మట్టి కుండలు సూక్ష్మమైన రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ కారణంగా వీటిలో వండేటపుడు అవి వేడిని, తేమను సమానంగా ప్రసరించడానికి అనుమతిస్తాయి, ఆహారంలో సహజ తేమ, సహజ నూనెలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా పోషక స్థాయిని నిలుపుకుంటుంది.

4. జీర్ణ సమస్యలు ఉండవు

మట్టికి ఉండే ఆల్కలీన్ స్వభావం కారణంగా ఆహారంలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది, ఇది మనకు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు అనేవి తలెత్తవు.

5. గుండెకు ఆరోగ్యకరం

ఇతర పాత్రలతో పోలిస్తే మట్టి కుండలలో వంట ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇదే చాలా ఉత్తమమైన ప్రక్రియ. తక్కువ నూనె అవసరం అవుతుంది. కాబట్టి, మట్టి కుండలలో వండిన ఆహారం ఇతర పద్ధతిలో తయారుచేసిన ఆహారం కంటే కొవ్వులో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారం మీ హృదయానికి మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం